భారత్ అభివృద్ధికి ఢోకా లేదు.. ఈ దశాబ్దం ఇండియాదే !!
economic growth: మాంద్యం పరిస్థితుల్లో ప్రపంచం విలవిల్లాడుతుండగా.. ఇండియా మాత్రం ఆర్థికాభివృద్ధిలో రాకెట్‌లా దూసుకుపోతోంది. వివిధ అంతర్జాతీయ సంస్థలు సైతం భారత్‌ను 'బ్రైట్ స్పాట్'గా అభివర్ణించాయి. ఈ లిస్టులోకి తాజాగా మరో సంస్థ వచ్చి చేరింది.
పటిష్ఠమైన ఆర్థిక వృద్ధి, యువ జనాభా, పట్టణీకరణ, మధ్యతరగతి కొనుగోలు శక్తి పెరుగుదల మన దేశానికి కలిసొచ్చే అంశాలంటూ HSBC ఓ నివేదిక విడుదల చేసింది. ఈ తరహా దీర్ఘకాలిక ధోరణుల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇండియా ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొంది.

డిజిటలైజేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ వృద్ధిలో వేగం, హైటెక్ ఎగుమతులు, పలు సంస్కరణలు మరియు కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లు.. దేశాభివృద్ధిని ముందుండి నడిపిస్తున్నట్లు తెలిపింది. ఇవి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలను, పెట్టుబడులు ఆకర్షించడాన్ని బాగా పెంచుతున్నాయని అభిప్రాయపడింది.
బలమైన ఆర్థిక మూలాలు కలిగి ఉండటంతో.. రాబోయే దశాబ్ధంలో ప్రపంచ 'గ్రోత్ ఇంజిన్‌గా' ఇండియా నిలవనున్నట్లు నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నట్లు చెప్పింది. ఇందుకోసం వేగంగా తన ఆర్థిక పరిమాణాన్ని 7 ట్రిలియన్ డాలర్లకు రెట్టింపు చేసే పనిలో ఉన్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications