energy: క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అనే మాటలను ఈమధ్య తరచూ వింటున్నాం. కానీ వాటి అవసరం ఏమిటో, మన జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో చాలా మందికి తెలియదు. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను మనం విపరీతంగా వాడుతున్నాం. డిమాండ్ కు తగిన స్థాయిలో ఆయిల్ నిల్వలు ఇండియాలో లేకపోవడం వల్ల విదేశాల నుంచి విపరీతంగా దిగుమతి చేసుకుంటున్నాం. తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని భారీ స్థాయిలో వెచ్చించాల్సి వస్తోంది.

ఆత్మనిర్భర భారత్ ఉత్సాహంతో:
క్రూడ్ ఆయిల్ రేట్లలో భారీ హెచ్చుతగ్గులు ఉంటుండటంతో క్లీన్ టెక్నాలజీ వైపు భారత్ మొగ్గుచూపింది. తద్వారా 2047 నాటికి ఇంధన స్వయం సమృద్ధి పొందగలదని అమెరికాకు చెందిన ఓ ఉన్నత పరిశోధనా సంస్థ నివేదించింది. విద్యుత్ మొబిలిటీ, పొదుపు, పునరుత్పాదక ఇంధన సామర్థ్యం వృద్ధికి.. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర భారత్ మంచి ఉత్సాహాన్ని ఇచ్చినట్లు పేర్కొంది. తద్వారా బిలియన్ల కొద్దీ డాలర్లు ఆదా కానున్నట్లు చెప్పింది.

దిగుమతుల తగ్గింపే అజెండా:
UC బర్కిలీ గోల్డ్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ వద్దనున్న లారెన్స్ బర్కిలీ నేషనల్ లాబొరేటరీతో పాటు ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ సెంటర్ (IECC) కలిసి ఈ నివేదికను రూపొందించాయి. 'పాత్‌వేస్ టు ఆత్మనిర్భర్ భారత్' పేరిట భారత క్లీన్ ఎనర్జీ ప్రయాణాన్ని ప్రచురించాయి. ఇటీవల కాలంలో క్లీన్ ఎనర్జీ వ్యయాలు గణనీయంగా తగ్గడం వల్ల పునరుత్పాదక శక్తి, బ్యాటరీ నిల్వ, EVలు మరియు గ్రీన్ హైడ్రోజన్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని ఇండియా వేగవంతం చేసింది. ఈ విధంగా ఇంధన దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

500GW రెన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యం:
ఇండియా చమురు, బొగ్గు అవసరాల్లో 80-85 శాతం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో ధరల హెచ్చుతగ్గులు, సరఫరాలో అస్థిరత వెరసి భారత విదేశీ మారక నిల్వలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఏర్పడుతోంది. దీనిని అధిగమించేందుకు 2030 నాటికి 500GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యం దిశగా అడుగులు వేయాలని ప్రధాని లక్ష్యం నిర్దేశించారు. EV వినియోగాన్ని ప్రభుత్వం విరివిగా అందుబాటులోకి తీసుకువస్తోంది. 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు:
సమృద్ధిగా ఉన్న సౌరశక్తి, అందుబాటులోని సాంకేతికత ద్వారా ఈ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోంది. ఈ చర్యల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడమే కాకుండా.. కర్బన ఉద్గారాల తగ్గింపు, స్థానికంగా కొలువుల సృష్టి, ఇంధనం విషయంలో స్వయం సమృద్ధి సాధించడానికి సిద్ధపడుతోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications