ట్రంప్ 25 శాతం సుంకం: భారత్‌లో ఈ అయిదు రంగాలకే పెద్ద దెబ్బ, లక్షాలాది ఉద్యోగాలు ప్రమాదంలో..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై ఆగస్టు 1 నుంచి 25 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. తన లిబరేషన్ డే వాణిజ్య వ్యూహంలో భాగంగా ఇండియాపై సుంకాల మోత మోగించారు ట్రంప్. ఈ వ్యూహం అమెరికా వాణిజ్య భాగస్వామ్యాలను పరస్పర ప్రయోజనాల దిశగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.దీంతో పాటుగా రష్యాతో వాణిజ్యం కారణంగా ఒక జరిమానా కూడా విధించబడుతుందని ట్రంప్ తెలిపారు. ట్రంప్ 25 శాతం సుంకాల ప్రభావం భారత ఎగుమతులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. ఏ రంగాలు ఎక్కువ నష్టపోతాయో ఓ సారి చూద్దాం.

భారత దేశంలో ఈ సుంకాల ప్రభావంతో సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు, ఆటోమొబైల్ రంగాలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోనున్నాయి. భారతదేశం..జపాన్ (15%), వియత్నాం (20%), ఇండోనేషియా (19%) కంటే ఎక్కువ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఈ దేశాలు కూడా అమెరికాకు పెద్ద ఎగుమతిదారులే. ఇది భారత ఎగుమతుల పోటీ తత్వాన్ని భారీగా దెబ్బ తీసే ప్రమాదం ఉంది.అయితే ఆగస్టు చివరిలో అమెరికా బృందం భారతదేశానికి రానుంది. ఈ చర్చల ద్వారా సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఔషధ రంగం, ఇనుము, ఉక్కు, ఆటోమొబైల్ వంటి రంగాలపై సుంకం వివరాలు ఇంకా స్పష్టంగా లేవు.

Trump India 25 tariff Indian exports at risk US trade penalties on India India US trade war 2025 shrimp exports affected Indian seafood tariff Trump sanctions Indian goods Indian IT exports to US US tariff on Indian pharma 25 - 25

ఏ రంగాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి.

ఆభరణాలు & రత్నాలు: జెమ్స్ & జ్యుయలరీ ఎగుమతులపై ఇప్పటికే తీవ్ర ఆందోళనలు ఉన్నాయి. ఏటా 10 బిలియన్ డాలర్లు విలువైన ఎగుమతుల జరుగుతున్నాయి. ఇక సుంకాలు పెరిగితే ఖర్చులు, డెలివరీ డిలేలు, ప్రాసెసింగ్ ఒత్తిడి పెరుగుతుందని గోల్డ్ ఇండస్ట్రీ హెచ్చరిస్తోంది. దాంతో పాటు వేలాది ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఫార్మాస్యూటికల్స్: భారత జనరిక్ ఔషధాలు అమెరికా మార్కెట్‌లో దాదాపు 40 శాతం వాటా కలిగి ఉన్నాయి. అయితే ట్రంప్ సుంకాల వల్ల సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా వంటి కంపెనీల ఆదాయంపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోను కావచ్చు.

ఎలక్ట్రానిక్స్: అమెరికా మార్కెట్‌కి ఐఫోన్లు సరఫరా చేయడంలో చైనా తరువాత భారత్ కీలక ఎగుమతిదారుగా ఉంది. అయితే ట్రంప్ 25 శాతం సర్‌ఛార్జ్ విధిస్తే ఆపిల్ తన ప్రొడక్షన్ వ్యూహాన్ని వెనక్కి తిప్పే అవకాశముంది.

చమురు శుద్ధి సంస్థలు: రష్యా చమురుపై ఆధారపడే ఇండియన్ రిఫైనర్లు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం వంటి సంస్థలు సగటున 37 శాతం దిగుమతులు రష్యా నుంచే చేస్తున్నారు. దీని ధరలు పెరిగితే, ఆయిల్ మార్జిన్లు క్షీణిస్తాయి. తద్వారా పెట్రోల్ రేట్లు పెరిగే ప్రమాదం ఉంది.

వస్త్ర, దుస్తుల రంగం: ఇండో కౌంట్, వర్ధమాన్ టెక్స్‌టైల్స్, వెల్‌స్పన్ లాంటి కంపెనీలు ఇప్పటికే తమ వ్యాపార వ్యూహాలను తిరిగి ఆలోచిస్తున్నాయి. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలతో పోటీ పడుతున్న భారత టెక్స్‌టైల్ రంగానికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం భారత ఎగుమతులలో దాదాపు 10 శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఇండియా-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 2024లో 129 బిలియన్ డాలర్లు దాటింది. ఇది రెండో అతిపెద్ద ట్రేడింగ్ భాగస్వామిగా మారింది.

భారత్‌పై ట్రంప్ ప్రభుత్వం విధించిన తాజా 25% దిగుమతి సుంకాల ప్రభావం కేవలం కొన్ని కంపెనీల స్థాయికే పరిమితం కాదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. తాజా అంచనాల ప్రకారం, భారత స్థూల దేశీయోత్పత్తి (GDP)పై 0.2% నుంచి 0.5% వరకు నష్టాన్ని ఎదుర్కొనే అవకాశముంది. దీని విలువ సుమారుగా 30 బిలియన్ డాలర్లు (రూ.2.60 లక్షల కోట్లు)గా అంచనా వేస్తున్నారు.

భారత్ ప్రపంచంలోనే అత్యధిక దిగుమతి సుంకాలు విధించే దేశాల్లో ఒకటి. పైగా, రష్యా నుంచి ఆయుధాలు మరియు చమురు కొనుగోలు చేయడం వంటి అంశాలు ఈ చర్యలకు కారణమని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సుంకాల వల్ల లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రొయ్యల ఎగుమతిదారులు, జెమ్స్ అండ్ జ్యూయలరీ పరిశ్రమ, ఫార్మా కంపెనీలు, గార్మెంట్, టెక్స్‌టైల్ రంగాలు దాదాపు భారత ఎగుమతులలో 40 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇవి ఎక్కువగా అమెరికా మీద ఆధారపడి ఉన్నందున, ఒక్కసారి ఆ మార్కెట్‌లో వ్యాపారం క్షీణిస్తే, ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి తలెత్తవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+