రష్యా నుంచి చమురు కొనుగోలు చేసుకోండి.. ఎటువంటి సుంకాలు ఉండవని తేల్చి చెప్పిన ట్రంప్..

India-US Trade Update: రష్యా, ఇరాన్‌లపై ఇటీవల విధించిన ఆంక్షలు, సుంకాల్లో కొన్నింటిని సడలిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సెప్టెంబర్‌లో చట్టంగా మారిన లిండ్సే ఓ. గ్రాహం రష్యా-ఇరాన్ ఆంక్షల చట్టం 2026లోని సెక్షన్ 115 ద్వారా సంక్రమించిన ప్రత్యేక అధికారాలను ఉపయోగిస్తూ.. అమెరికా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కొన్ని ఆంక్షలను నిలిపివేస్తున్నట్లు కాంగ్రెస్‌కు పంపిన నివేదికలో ట్రంప్ వెల్లడించారు. రష్యా నుండి భారీగా ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న భారతదేశం, చైనా వంటి దేశాలపై 100 శాతం వరకు ప్రతిపాదించిన ప్రతీకార దిగుమతి సుంకాల భయాలను ఈ నిర్ణయం తాత్కాలికంగా తొలగించింది.

రష్యా చమురును అతిపెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న దేశాలలో ఒకటైన భారత్‌పై.. ఈ కొత్త చట్టం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వాషింగ్టన్‌కు స్పష్టం చేసింది. న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఈ ఆంక్షల చట్టం వల్ల ఎదురయ్యే సవాళ్లను లేవనెత్తారు.

Trump Russia tariffs India oil imports Trump tariff waiver Russian crude oil India 100 percent tariff threat India US trade relations Russia oil sanctions 2026 Donald Trump latest news Indian exporters Russian energy imports US trade policy India energy security October 17 2026 news 100

అమెరికా-రష్యాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం, సడలింపులపై ఇప్పటికే భారత్ స్పందించింది. భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య కుదిరే వ్యాపార ఒప్పందాలపై భారత్ వ్యాఖ్యానించదని, అయితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో స్థిరత్వం కొనసాగాలన్నదే తమ నిలకడైన విధానమని తేల్చి చెప్పారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆర్థిక ప్రయోజనాలు, ఇంధన భద్రతను కాపాడటానికి రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతులు కొనసాగించడం భారత్‌కు అత్యంత కీలకమని ఆయన పునరుద్ఘాటించారు.

Also Read

అమెరికాలో నవంబర్‌లో జరగనున్న మిడ్‌టర్మ్ ఎన్నికల నేపథ్యంలో అక్కడి పౌరులపై పెరిగిన డీజిల్, ఇంధన ధరల భారాన్ని తగ్గించడానికే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డీజిల్ ధరలు పెరిగితే రవాణా, వ్యవసాయ రంగాలు దెబ్బతిని సరఫరా వ్యవస్థలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని భావించిన ట్రంప్ ప్రభుత్వం.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేక ఒప్పందం చేసుకుంది.ఈ ఒప్పందం కింద రష్యా తక్షణమే 3,00,000 టన్నుల డీజిల్‌ను అమెరికాకు సరఫరా చేయడానికి అంగీకరించింది. నవంబర్ నాటికి మరో 5,00,000 టన్నులు, ఆ తర్వాత దశలవారీగా కోటి టన్నుల వరకు డీజిల్ అమెరికాకు సరఫరా కానుంది.

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయ ఎగుమతిదారులపై 100 శాతం సుంకాల తక్షణ ముప్పు తప్పినప్పటికీ.. వైట్‌హౌస్ ఇచ్చిన ఈ మినహాయింపు తాత్కాలికమేనని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా విదేశాంగ శాఖ నిర్వహించే తదుపరి విధాన సమీక్షల ఆధారంగానే ఈ మినహాయింపులు ఎంతకాలం ఉంటాయనేది ఆధారపడి ఉంటుంది. కాగా రెండు దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ పరిణామం భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు కొంత ఊపిరి పీల్చుకునే అవకాశాన్ని ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+