గత కొన్ని వారాలుగా India US Trade Deal గురించిన చర్చలు ఎక్కడికక్కడ ఆగిపోయాయేమో అన్న భావన చాలా మందిలో ఉంది. ఇరు దేశాల నుండి ఎటువంటి పెద్ద ప్రకటనలు లేవు. అయితే భారతదేశం తన ఇంధన వనరుల విధానంలో చేస్తున్న కీలకమైన మార్పులను గమనిస్తే అసలు కథ తెర వెనుక నెమ్మదిగా మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఈ వ్యూహాత్మక మార్పులే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి రహస్యంగా మార్గం సుగమం చేస్తున్నాయి.
ఇంధన రంగంలో మార్పులు
గత కొంత కాలంగా భారత ఇంధన రంగంలో కొన్ని మార్పులు వస్తున్నాయి. రష్యా నుంచి వచ్చే చమురు వల్లనే అమెరికాతో భారత్ తో గొడవ పెట్టుకుంది. అయితే నవంబర్‌లో ఈ రష్యా బ్యారెళ్ల దిగుమతి ఒక్కసారిగా భారీగా తగ్గింది. ట్యాంకర్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. అక్టోబర్ నెల పరిమాణంలో దాదాపు సగం అంటే, రోజుకు సుమారు 9.48 లక్షల బ్యారెళ్ల చమురు మాత్రమే భారత్‌కు చేరింది.
అమెరికా సుంకాల కారణంగా భవిష్యత్తులో సరఫరాలో అంతరాయాల ప్రమాదం పెరగవచ్చని భారత రిఫైనరీలు గ్రహించాయి. అందుకే భారత్ కొనుగోలు విధానాలను మార్చుకుంది. ఈ మార్పులే విస్తృతమైన India US Trade Deal కు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని వాణిజ్య నిపుణులు అంటున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న అతి పెద్ద చిక్కుముడిని భారతదేశం స్వచ్ఛందంగా విప్పుతున్నట్లుగా దీనిని చూడవచ్చు.

సరైన నిర్ణయం
రష్యాకు బదులు వేరే చోట్ల చమురు కొనడం భారతదేశానికి ఖర్చుతో కూడుకున్నది. ఈ మార్పు వల్ల భారతదేశ వార్షిక చమురు దిగుమతుల బిల్లుపై 3-5 బిలియన్ డాలర్ల అదనపు భారం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ తన ముడి చమురు అవసరాలలో దాదాపు 88% దిగుమతి చేసుకుంటుంది. కాబటటి ఈ భారం చిన్నది కాదు. అయినప్పటికీ, ఆంక్షలు మరింత బిగుసుకుంటున్న నేపథ్యంలో సరఫరా ప్రమాదాన్ని తగ్గించడానికి.. న్యూఢిల్లీ ఈ ఆర్థిక భారాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బదులుగా మరింత స్థిరమైన, ఊహించదగిన సరఫరాను పొందాలని భారత్ కోరుకుంటోంది.
అమెరికాతో దీర్ఘకాలిక ఒప్పందాలు
ఇదే వ్యూహంలో భాగంగా భారత్.. అమెరికా గల్ఫ్ కోస్ట్ నుంచి 2026 కోసం 2.2 మిలియన్ టన్నుల ఎల్‌పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) దిగుమతి చేసుకోవడానికి ఒక దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది. ఇది భారత్ వార్షిక ఎల్‌పీజీ దిగుమతులలో దాదాపు పదో వంతు. ఇప్పటివరకు భారత్ కుదుర్చుకున్న అమెరికన్ ఇంధన ఒప్పందాలలో ఇది అత్యంత వ్యవస్థీకృతమైనది.
అంతేకాకుండా అమెరికా నుంచి ముడి చమురు దిగుమతులు కూడా పెరిగాయి. అక్టోబర్‌లో ఈ దిగుమతులు దాదాపు మూడేళ్లలో అత్యధికంగా రోజుకు 5.4 లక్షల బ్యారెళ్లకు చేరుకున్నాయి. ఈ చర్యలన్నీ భారత్ ఒకే సరఫరాదారుపై కేంద్రీకృతమై ఆధారపడకుండా, నెమ్మదిగా, వ్యూహాత్మకంగా వైవిధ్యభరిత సరఫరా వైపు అడుగులు వేస్తోందని స్పష్టం చేస్తున్నాయి.
వాణిజ్యానికి దారి సుగమం
భారత్ తీసుకుంటున్న ఈ ఇంధన రంగ నిర్ణయాలను వాషింగ్టన్ నిశితంగా గమనిస్తోంది. అమెరికా ఈ సంవత్సరం భారతీయ ఎగుమతులపై సుంకాలను 50% వరకు పెంచినప్పటికీ.. అదే సుంకాల నోటిఫికేషన్‌లలో 200కు పైగా వ్యవసాయ ఉత్పత్తులకు మినహాయింపులు ఇవ్వడం గమనార్హం. అంటే.. చర్చలకు ద్వారం ఎప్పుడూ పూర్తిగా మూసివేయలేదన్నది స్పష్టం.
భారతదేశం కూడా రాజకీయంగా సున్నితమైన వ్యవసాయం వంటి రంగాలను రక్షించుకుంటూనే.. కొన్ని ఇతర రంగాలలో సౌలభ్యాన్ని చూపింది. దూరం నుంచి చూస్తే ఇవి ఘర్షణ వాతావరణంగా అనిపించినా.. ఇరుపక్షాల చర్యలు ఒక రకమైన పాజిటివిటీనే సూచిస్తున్నాయి.
త్వరలో శుభవార్త వస్తుందా?
కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, India US Trade Deal చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని, ఇరుపక్షాలు సమతుల్యమైన, న్యాయమైన ఒప్పందానికి వచ్చిన తర్వాతే కొంత శుభవార్త వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే కాలపరిమితిని ప్రకటించడం లేదు. ఎందుకంటే గడువులు అనవసరమైన అంచనాలను పెంచుతాయి. భారత్ తన వైఖరిని స్పష్టంగా చెప్తోంది. ఒప్పందం న్యాయంగా, సమతుల్యంగా ఉంటేనే ముందుకు వెళ్తామని, తొందరపడబోమని మంత్రి చెప్పారు.
ప్రస్తుతం ఉన్నత స్థాయి చర్చల రౌండ్లకు బదులుగా కస్టమ్స్, సర్టిఫికేషన్ నిబంధనలు, డిజిటల్ నియమాలు, సేవల వంటి సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి అధికారులు సమావేశమవుతున్నారు. రష్యా చమురు దిగుమతులు తగ్గడం, అమెరికాతో దీర్ఘకాలిక ఎల్‌పీజీ ఒప్పందం కుదరడం వంటి ఇంధన మార్పులు వంటివి చూస్తుంటే.. త్వరలో ఇరుదేశాలు మళ్లీ తిరిగి ఒప్పందాలు చేసుకునే అవకాశం కనిపిస్తుంది.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications