Import restrictions: ప్రతి విభాగంలో దేశాన్ని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందుకుగాను వోకల్ ఫర్ లోకల్ పేరిట మేకిన్ ఇండియా ఇనీషియేటివ్ ను ప్రారంభించింది. అదనంగా దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు, విదేశాల నుంచి దిగుమతులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ జర్నీలో పలు కొత్త నిర్ణయాలు సైతం తీసుకున్నట్లు ఇటీవల మోదీ సర్కార్ ప్రకటించింది.
కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై కేంద్రం ఇటీవల ఆంక్షలు విధించింది. లైసెన్సింగ్ విధానాన్ని సైతం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో కొంత మెత్తబడినట్లు కనిపిస్తోంది. గత ప్రకటనను అమలు చేయడం లేదని అధికారికంగా ప్రకటించింది. తద్వారా నవంబర్ 1 నుంచి అమలు కోసం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.

భద్రతా కారణాలు సహా దేశీయ తయారీని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోదీ సర్కారు ఆగస్టు 3న ప్రకటించింది. ఇంపోర్ట్ చేసుకునే ఉత్పత్తులు, అవి ఎగుమతి కాబడిన దేశాలకు సంబంధించిన డేటాను దిగుమతి దారులు తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని స్పష్టం చేసింది. అయితే ఆపిల్, సాంసంగ్ వంటి దిగ్గజ సంస్థలు దీనిపై స్పందించాయి. భారత్ తన వైఖరిని పునః సమీక్షించాలని అభ్యర్థించాయి.
ఇటీవల జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO) సదస్సులోనూ భారత నిర్ణయం పట్ల అమెరికా, చైనా, దక్షిణ కొరియాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మోదీ సర్కారు వైఖరి అంతర్జాతీయ ట్రేడ్ నిబంధనకు విరుద్ధంగా ఉందని ఆరోపించాయి. దీంతో భారత ప్రభుత్వం పునరాలోచనలో పడిందని వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు తన నిర్ణయం పట్ల యూ-టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications