Trade Deficit: 5 నెలల గరిష్ఠానికి భారత వాణిజ్య లోటు.. క్షీణించిన ఎగుమతులు
Trade Deficit: మే నెలకు సంబంధించిన వాణిజ్య గణాంకాలను ప్రభుత్వం నేడు విడుదల చేసింది. మే నెలలో భారతదేశ వాణిజ్య లోటు ఐదు నెలల గరిష్ఠ స్థాయి అయిన 22.12 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకు ముందు నెలలో ఇది 15.2 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఏడాది కిందట ఇదే కాలంలో పోల్చితే.. మొత్తం వాణిజ్య లోటు మే 2023లో 10.35 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా మందగించిన డిమాండ్ కారణంగా ఎగుమతులు ఏప్రిల్‌లో 12.7 శాతం కుదించబడిన తర్వాత వరుసగా నాలుగో నెల కూడా తగ్గాయి. మే నెలలో సేవల ఎగుమతులు 25.30 బిలియన్ డాలర్లుగా ఉండగా.. దిగుమతులు 13.53 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.

ఏప్రిల్-మే నెలలో మొత్తం వాణిజ్య లోటు 35.41 శాతం తగ్గిందని వాణిజ్య కార్యదర్శి సునీల్ భరత్వాల్ తెలిపారు. ఏప్రిల్‌లో 20 నెలల కనిష్ఠ స్థాయి అంటే 15.46 బిలియన్ డాలర్లకు చేరిన వస్తువుల వాణిజ్య లోటు డిసెంబర్ 2022 నుండి 20 బిలియన్ డాలర్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి. 2023-24 మొదటి రెండు నెలల్లో సరుకుల ఎగుమతుల్లో 11.4% క్షీణత మరియు దిగుమతి బిల్లులో 10.24% తగ్గుదల నమోదైంది.
అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో మందగమనం, వాటి GDP వృద్ధి రేట్లలో పతనం కారణంగా వారు దిగుమతులను తగ్గించినట్లు వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ అన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్, డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఎగుమతుల వ్యూహంపై పని చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఇందుకోసం వారు దాదాపు 40 దేశాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications