Shipping News: ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించేందుకు భారత్ తహతహలాడుతోంది. ఈ సమయంలో అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇంధనం దగ్గర నుంచి సముద్రం వరకు ఓ ఒక్కదాన్నీ విడిచిపెట్టాలని భావించడం లేదు. పనికిరాని చెత్త నుంచి కూడా తిరిగి భారీ స్థాయిలో సంపదని సృష్టించాలని కలలు అంటుంది. కాగా ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
దేశానికి ఉన్న అపారమైన సాగర తీరాన్ని తెలివిగా వినియోగించుకోవాలని భారత ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. నౌకా వాణిజ్యం ద్వారా పెద్ద మొత్తంలో అర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకుగాను 1000 నౌకలతో కూడిన షిప్పింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన అధిక వ్యవస్థగా నిలవాలని బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి మౌలిక సదుపాయాలను పునరుద్ధరిస్తుంది.

షిప్పింగ్ కంపెనీ ఏర్పాటు కోసం దేశీయ చమురు, ఎరువులు వంటి పలు ప్రభుత్వ రంగ సంస్థలతో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చర్చలు జరుపుతోంది. విదేశీ సంస్థలతోనూ ఇందుకు సంబంధించి మాట్లాడుతున్నట్లు సమాచారం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 85 బిలియన్ డాలర్లను సరుకు కోసం భారతీయ కంపెనీలు వెచ్చించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ మొత్తంలో 75 బిలియన్ డాలర్లు కేవంల రవాణా కోసం మాత్రమే వెచ్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇకపై ఈ తరహా ఆటలు చెల్లవని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
ఈ ప్లాన్ కి సంబంధించి రోడ్ మ్యాప్ ను రెడీ చేసేందుకు మే 16న రెండు ప్రభుత్వ రంగ సంస్థలు సమావేశమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో ట్యాంకర్లు, గ్యాస్ క్యారియర్లు, కంటైనర్ షిప్స్ మరియు బల్క్ క్యారియర్లు వంటి 1,500 పెద్ద నౌకలు ఇప్పటికే ఉన్నాయి. కాగా కొత్తగా రానున్న 1000 నౌకలతో కలిపి భారత్ ను ఓ గేమ్ చేంజర్ గా మార్చింది. కేంద్రంలో కొత్తగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానున్న తరుణంలో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తుందో లేదో వేచి చూడాలి మరి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications