hydrogen tain: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైల్వేల అభివృద్ధి కోసం 2.41 లక్షల కోట్లను కేటాయించారు. అయితే రైల్వేలలోనూ హైడ్రోజన్ ఇంధన వినియోగంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి హైడ్రోజన్ ఆధారిత రైళ్లను తయారు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే గత ఆగస్టులో జర్మనీ, డిసెంబరులో చైనా వీటిని అందుబాటులోకి తీసుకురాగా.. ఆసియాలో ఈ తరహా రైళ్లను ప్రవేశపెట్టనున్న రెండో దేశంగా భారత్ నిలవనుంది.

గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట:
గ్రీన్ ఎనర్జీపై ఈ బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెట్టిందని అశ్విని వైష్ణవ్ అన్నారు. అందులో భాగంగా హైడ్రోజన్ రైలు తయారు చేసేందుకు నిర్ణయించామన్నారు. మొదటగా కల్కా-సిమ్లా వంటి వారసత్వ ప్రాముఖ్యత ఉన్న రూట్ లో దీనిని ప్రవేశపెట్టి, క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు. గురుకృపా వంటి కొత్త రూట్లను ఈ జాబితాలో చేర్చడం ద్వారా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చూపించాలనే ప్రధాని మోడీ ఆశయం కూడా నెరవేర్చినట్లవుతుందని వెల్లడించారు.

దేశానికి గ్రోత్ ఇంజిన్:
పూర్తిగా స్వదేశంలోనే రూపొందించి, ఇక్కడే హైడ్రోజన్ రైలు తయారు చేస్తామని రైల్వే మంత్రి చెప్పారు. ఉత్తర రైల్వే వర్క్‌షాప్‌లో హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు నమూనాను అభివృద్ధి చేస్తున్నామని గత నెలలోనే ఆయన ప్రకటించారు. అనంతరం హర్యానాలోని సోనిపట్-జింద్ సెక్షన్‌లో పరీక్షిస్తామన్నారు. 2023 బడ్జెట్ దేశానికి గ్రోత్ ఇంజిన్‌లా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సారి రైల్వేల కోసం కేటాయించిన 2.41 లక్షల కోట్లతో ప్రయాణీకుల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా పెద్ద మార్పులు తెస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని చోట్ల వందేభారత్ రైళ్ల తయారీ:
రైల్వేల అభివృద్ధిని ప్రస్తావిస్తూ.. 'అమృత్ భారత్ స్టేషన్' పథకం కింద 1,275 స్టేషన్లను తిరిగి అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. చెన్నలో మాత్రమే కాకుండా హర్యానాలోని సోనిపట్, మహారాష్ట్రలోని లాతూర్ లోనూ వందేభారత్ రైళ్లు తయారు చేయనున్నట్లు చెప్పారు. 2014కి ముందు ప్రతిరోజూ కేవలం 3 కి.మీ ట్రాక్ మాత్రమే వేసేవారని.. ప్రస్తుతం 12 కి.మీ కు పెంచామని చెప్పారు. వచ్చే ఏడాది నాటికి రోజుకి 16 కి.మీ ట్రాక్ వేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications