ప్రపంచానికి షాకిచ్చిన భారత్.. కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో దుమ్మురేపిన ఇండియా
భారతదేశం మరో గొప్ప మైలురాయిని చేరుకోబోతోంది. 2025 మూడవ త్రైమాసికం నాటికి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద కార్యాలయ మార్కెట్ గా అవతరించబోతోంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక ప్రకారం.. దేశంలోని కార్యాలయాల స్పేస్ త్వరలోనే 1 బిలియన్ చదరపు అడుగులను దాటనుంది. A Billion Sq Ft and Counting - India Office Supply Growth Story అనే నివేదికలో భారత కార్యాలయ స్థలాల్లో వేగంగా దూసుకెళుతున్న అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది.
2025 మొదటి అర్ధభాగంలోనే.. బెంగళూరు, NCR (ఢిల్లీ సహా), ముంబై, హైదరాబాద్, చెన్నై, పుణే, అహ్మదాబాద్, కోల్కతా వంటి ఎనిమిది ప్రధాన నగరాల్లో కలిపి 993 మిలియన్ చదరపు అడుగులు కార్యాలయ స్థలం నమోదైంది. ఇందులో బెంగళూరు నగరం 229 మిలియన్ చదరపు అడుగులతో అగ్రస్థానంలోఉంది. ఇక దేశ రాజధాని పరిధిలో గల NCRలో 199 మిలియన్, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 169 మిలియన్ చదరపు అడుగులు ఉన్నాయి. ఈ మూడు నగరాలు కలిపి మొత్తంగా 60 శాతం కార్యాలయ స్థోమతను కలిగి ఉన్నాయని నివేదిక తెలిపింది.

నైట్ ఫ్రాంక్ ఛైర్మన్ శిశిర్ బైజల్ ప్రకారం..1 బిలియన్ చదరపు అడుగుల మైలురాయి సాధించడం కేవలం గణాంకాల వ్యవహారమే కాదు.. ఇది భారత కార్యాలయ మార్కెట్‌కు అంతర్జాతీయంగా బలమైన డిమాండ్ ను చూపిస్తోందన్నారు. ఈ అభివృద్ధికి ప్రధాన కారణాలు ఏంటంటే.. గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ల (GCCs) డిమాండ్, స్టార్ట్-అప్స్ పెరగడం, ఇంటర్నేషనల్ IT కంపెనీలు రావడం, ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌ల పెరుగుదలతో పాటుగా మౌలిక సదుపాయాల పురోగతిగా చెప్పుకోవచ్చు. అలాగే గ్రేడ్ A ఆఫీస్ స్పేస్ పై పెరుగుతున్న ఆసక్తిగా కూడా చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం మొత్తం ఆఫీస్ స్టాక్ విలువ రూ. 16.07 ట్రిలియన్లు (అంటే 187 బిలియన్ డాలర్లు)గా ఉంది. ఇందులో 53% గ్రేడ్ A, 43% గ్రేడ్ B,4% గ్రేడ్ C కింద ఉంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో IT రంగ ప్రభావం వల్ల అధికంగా గ్రేడ్ A కార్యాలయాలు అభివృద్ధి అయ్యాయని నివేదిక తెలిపింది. నైట్ ఫ్రాంక్ పరిశోధన ప్రకారం.. 2036-2041 మధ్యలో మరో బిలియన్ చదరపు అడుగులు యాడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే, ప్రస్తుతం ఉన్న ఆఫీస్ స్టాక్‌లో 30 శాతం పాతవి కాగా అవి పునరుద్ధరణకు (retrofit) అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది.
2025లో నెలకు సగటు అద్దె 0.96/డాలర్ చదరపు అడుగుగా ఉండటం భారతదేశాన్ని అంతర్జాతీయంగా బలమైన పోటీదారుగా నిలబెడుతోంది. అయితే భవిష్యత్తులో సరఫరా, డిమాండ్ మధ్య సమతుల్యత కోసం నియామకపరమైన జోక్యంతొ పాటుగా దీర్ఘకాలిక పెట్టుబడులు అవసరమని నివేదికలు సూచిస్తున్నాయి.
2025 మొదటి అర్ధభాగంలో, భారతదేశంలోని ప్రముఖ ఎనిమిది నగరాలలోని మొత్తం కార్యాలయ స్థోమత 993 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. ఇది దేశం త్వరలోనే 1 బిలియన్ చదరపు అడుగుల మార్కును దాటబోతోందనే స్పష్ట సంకేతంగా చెప్పుకోవచ్చు. ఈ కార్యాలయ స్పేస్ లో బెంగళూరు, జాతీయ రాజధాని ప్రాంతం (NCR), మరియు ముంబై ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. వీటి కలిపిన వాటా మొత్తం కార్యాలయ స్టాక్‌లో సుమారు 60 శాతంగా ఉంది. ఈ గణాంకాలు భారతదేశం గ్లోబల్ ఆఫీస్ మార్కెట్‌లో వేగంగా ఎదుగుతున్నదనే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.


Click it and Unblock the Notifications