Atmanirbhar: ఇంటర్నెట్ లో ఏదైనా సెర్చ్ చేయడానికి ఎక్కువ మంది వినియోగించే బ్రౌజర్ గూగుల్ కు చెందిన క్రోమ్. మొజిల్లా ఫైర్ ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఒపెరా వంటి బ్రౌజర్లు పోటీపడుతున్నా.. గూగుల్ మాత్రం తన స్థానం కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పుడు దానికి కాస్తా భారత ప్రభుత్వం చెక్ పెట్టడానికి సిద్ధమైంది.
గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వంటి ప్రముఖ బ్రౌజర్స్ తో పోటీపడే విధంగా 'ఆత్మనిర్భర్' పేరిట వెబ్ బ్రౌజర్ ను భారత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. మార్కెట్లోని ఇతర వాటికి ధీటుగా, దేశీయంగా రూపొందించిన వెబ్ బ్రౌజర్‌లకు మద్దతు ఇచ్చే కార్యక్రమాన్ని మోదీ సర్కారు ప్రారంభించింది.

'ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగుతోంది. ఈ పరిస్థితుల్లోల మన డిజిటల్ విధానంపై మనకు నియంత్రణ ఉండటం ముఖ్యం. సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తే సందర్భాల్లో విదేశీ బ్రౌజర్‌లపై ఆధారపడటం మాకు ఇష్టం లేదు. అందులోనూ స్వయం సమృద్ధిగా ఉండాలని భావిస్తున్నాం' అని ఓ అధికారి తెలిపారు. ఈ బ్రౌజర్ భారతీయ భాషలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు.
వెబ్ బ్రౌజర్ డెవలప్‌మెంట్ ఛాలెంజ్ కోసం 3 కోట్ల కంటే ఎక్కువ గ్రాంట్ ను ప్రభుత్వం అందించింది. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోంది. Google మరియు మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వంటి ప్రధాన US బ్రౌజర్ కంపెనీల 'ట్రస్ట్ స్టోర్‌లలో' మన వెబ్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ అథారిటీని చేర్చేందుకు అవకాశం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
దాదాపు 850 మిలియన్ల వినియోగదారులతో ఇంటర్నెట్ మార్కెట్‌లో భారత్ దూసుకుపోతోంది. ఈ విభాగంలో గూగుల్ క్రోమ్ 88.47 శాతం మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్ గా కొనసాగుతుండగా.. సఫారి 5.22, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ 2, శామ్‌సంగ్ ఇంటర్నెట్ 1.5, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 1.28 శాతంతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 2024 చివరి నాటికి ఆత్మనిర్భర్ బ్రౌజర్ కూడా ఈ జాబితాలోకి చేరనున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్‌లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications