భారత దేశం ఆర్థిక రంగంలో మరో అడుగు ముందుకు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో పాల్గొంటూ, దేశ భవిష్యత్తు దిశగా పెద్ద ప్రకటన చేశారు. ఆయన స్పష్టంగా "భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది" అని అన్నారు. ఇది కేవలం గణాంకాల మాట మాత్రమే కాదు, కేంద్రం తీసుకుంటున్న చర్యలు కూడా అదే చూపిస్తున్నాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఒక ప్రోత్సాహక పథకాన్ని కూడా ప్రకటించారు. ప్రైవేట్ రంగంలో తొలిసారి ఉద్యోగంలో చేరే యువతకు నెలకు రూ. 15,000 జీతాన్ని ప్రభుత్వం మద్దతుగా ఇస్తుంది. అంటే, మీరు ఒక ప్రైవేట్ కంపెనీలో మొదటిసారిగా ఉద్యోగం తీసుకుంటే, ఆ మొదటి నెల జీతాన్ని కేంద్ర ప్రభుత్వం భరించనుంది. ఇది ఉద్యోగాలు రాకపోతున్నాయన్న విమర్శలకు నిజమైన సమాధానం కూడా.
ఈ స్కీమ్‌కి మోదీ సర్కారు రూ.1 లక్ష కోట్ల భారీ నిధిని కేటాయించింది. దీని ద్వారా వచ్చే 5 సంవత్సరాల్లో 3.5 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా నిర్మాణ రంగం, తయారీ, రక్షణ తయారీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్‌ల వంటి రంగాల్లో ఇది గణనీయంగా ప్రభావం చూపనుంది.
మోదీ చెప్పిన విషయాల్లో ఇంకొక కీలకమైన అంశం "వచ్చే కొన్ని సంవత్సరాల్లోనే భారత్ గ్లోబల్ టాప్ 3 ఎకానమీగా నిలుస్తుంది." ఇప్పుడు ఐదవ స్థానంలో ఉన్న భారత్, త్వరలో జపాన్, జర్మనీలను దాటి మూడవ స్థానానికి చేరే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోదీ తన ప్రసంగంలో తయారీ రంగాన్ని దేశ ఆర్థిక పురోగతికి కేంద్రబిందువుగా పేర్కొన్నారు. ఆయన పేర్కొన్న విధంగా, "ఈ రోజు భారతదేశానికి తయారీ రంగం ఒక గొప్ప బలం. అనేక కొత్త ఉద్యోగాలు ఈ రంగంలో వచ్చి, యువతకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఈ ఏడాది బడ్జెట్‌లో 'మిషన్ మాన్యుఫ్యాక్చరింగ్' అనే ప్రణాళికను ప్రకటించాం. గత కొన్ని సంవత్సరాలుగా మేడ్ ఇన్ ఇండియా క్యాంపెయిన్‌ను బలపరుస్తూ, దేశీయ తయారీని ప్రోత్సహించాం" అని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా రెండు రంగాలను ప్రస్తావించారు. ఎలక్ట్రానిక్స్ & మొబైల్ ఫోన్ తయారీ మరియు డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ఇవి భారతదేశ తయారీ శక్తిని ప్రపంచానికి చాటే కీలక రంగాలుగా అభివర్ణించారు.
ఇలా మాట్లాడుతూ, "ఇప్పుడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఒకటి. ప్రస్తుతం భారతదేశ రక్షణ ఉత్పత్తి రూ. 1.25 లక్షల కోట్లను అధిగమించింది. 'మేక్ ఇన్ ఇండియా' దిశగా ఇది ఒక గొప్ప ముందడుగు. మన యువత శ్రమతో, దేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా స్పష్టమైన అడుగులు వేస్తోంది" అని తెలిపారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) నివేదికను ప్రస్తావించిన మోదీ, "గత 11 సంవత్సరాల్లో ప్రతి రంగంలో అభివృద్ధి జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం సామాజిక భద్రతకే కాదు, ఉద్యోగావకాశాల సృష్టికి కూడా దోహదం చేస్తున్నాయి. ఉద్యోగ కల్పనలో వాటి పాత్ర కీలకం" అని అన్నారు.
ఇవి వింటుంటే, 'పదవులకు లేఖలు ఇచ్చినంత మాత్రాన మార్పేమిటి?' అనే సందేహం కూడా వస్తుంది. కానీ గతంలో 2022 నుంచి ఇప్పటివరకు రోజ్‌గార్ మేళా ద్వారా కేంద్రం దాదాపు 10 లక్షల పైగా ఉద్యోగాలను ఇప్పటికే ఇచ్చింది. ఇవి అన్నీ ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలు కావడం విశేషం. అంటే, చెప్పిన దానికి కంటే చేసిన పని ఎక్కువగా ఉంది అన్నమాట.
ఇవన్నీ చూస్తే, కొత్తగా ఉద్యోగంలోకి వచ్చే యువతకు ఇది గొప్ప ఊరట. మొదటి జీతం ప్రభుత్వమే ఇస్తే, వారు ధైర్యంగా, భద్రతగా ఫీలవుతారు. అలాగే చిన్న కంపెనీలూ కొత్త ఉద్యోగులను తీసుకోవడంలో మరింత ఉత్సాహంగా ఉంటాయి.
ఇది కేవలం ఉద్యోగ పథకం మాత్రమే కాదు దేశ ఆర్థిక రీతి మలుపు తిరుగుతున్న సంకేతం. అభివృద్ధి దిశగా, యువత భాగస్వామిగా మారే కొత్త దారులు తెరుచుకుంటున్నాయి. "ఉద్యోగం కోసం వెతుకుతూనే ఉండడం కాదు... ఇప్పుడు ప్రభుత్వం కూడా మీ వెంటే ఉంది" అనే నమ్మకం ఈ స్కీమ్ రూపంలో దృవీకరించబడింది
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications