ఢిల్లీ: బ్రిటన్‌లో కొత్త రకం కరోనా మహమ్మారి వెలుగు చూసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశం నుండి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. డిసెంబర్ 22వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు లండన్ నుండి భారత్‌కు లేదా భారత్ నుండి లండన్‌కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది.
యూకే నుండి డిసెంబర్ 22 అర్ధరాత్రి లోపు భారత్‌కు వచ్చే ప్రయాణీకులు విమానాశ్రయాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేయించుకోవాలని సూచించింది. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి ప్రభుత్వం తాజాగా హెచ్చరించింది. దీంతో ఐరోపా సహా ప్రపంచ దేశాలన్ని అప్రమత్తమయ్యాయి.

పలు దేశాలు ఇప్పటికే బ్రిటన్‌కు విమాన సర్వీసులను నిలిపివేశాయి. అయితే కొత్త రకం వైరస్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని భారత ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అలాగే, కరోనా పుట్టుక, వ్యాప్తిపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ నేడు కీలక సమావేశం నిర్వహించింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications