ప్రపంచవ్యాప్తంగా ఏటా సైబర్ దాడుల వల్ల లక్షలాది కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. ఆయా దేశాలకు సంబంధించిన రాజకీయ, సైనిక, ఆర్థిక రహస్యాలను హ్యాకర్లు అక్రమంగా చేజిక్కించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో భారత్ ప్రముఖ బాధితురాలిగా మారింది.
సైబర్ దాడులు చేసేందుకు హ్యాకర్లు భారత్ ను ఎక్కువగా లక్ష్యం చేసుకుంటున్నట్లు ప్రముఖ ల్యాండ్ స్కేప్ మేనేజ్ మెంట్ ప్లాట్ ఫారమ్ సైఫర్మా నివేదించింది. విద్య, పరిశోధన, ప్రభుత్వం, సైనిక రంగాల తర్వాత హెల్త్ కేర్ మీద వారు అధికంగా దృష్టి సారించినట్లు వెల్లడించింది. 2022లో దేశంలోని పలు సంస్థలు సగటున వారానికి 1,866 సైబర్‌టాక్‌లను ఎదుర్కొన్నట్లు చెప్పి షాక్ ఇచ్చింది.

నివేదిక ప్రకారం.. మొత్తం ప్రపంచ వ్యాప్త సైబర్ అటాక్స్ లో భారత్ వాటా 13.7 శాతం కావడం కలవరపరుస్తోంది. వీటిలోనూ ప్రభుత్వ సంస్థలు టాప్ ప్లేస్ లో ఉన్నాయి. 2021తో పోలిస్తే 2022లో ఏకంగా 95 శాతం పెరుగదల నమోదైంది. ఇక అమెరికాని 9.6, ఇండోనేషియాని 9.3, చైనాను 4.5 శాతం హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు.
"అంతర్జాతీయ విపణిలో ఇండియా ప్రాముఖ్యత పెరుగుతోంది. ఇతర పెద్ద దేశాలను కాదని పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలు వివిధ విషయాల్లో భారత్ కు మద్ధతుగా ముందుకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఏజెన్సీల వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం కలిగించేందుకు ఇండియాపై సైబర్ దాడులకు పాల్పడుతున్నారు" అని సైఫిర్మా CEO మరియు వ్యవస్థాపకులు కుమార్ రితేష్ తెలిపారు.
దేశంలో అత్యంత సాధారణ సైబర్ అటాక్స్ రకాలు ఫిషింగ్, మాల్వేర్ మరియు రాన్సమ్ వేర్ దాడులు. 2021లో 78 శాతం భారతీయ సంస్థలు రాన్సమ్ వేర్ దాడులను ఎదుర్కొన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 80 శాతం దాడులు డేటా ఎన్‌క్రిప్షన్ కోసం చేసినవేనని తెలుస్తోంది. ఇలా ఇండియాను లక్ష్యంగా చేసుకున్న 39 సంస్థలను సైఫిర్మా గుర్తించినట్లు పేర్కొంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications