హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో మెరుగైన భారత్ ర్యాంక్.. వీసా లేకపోయినా ఇండియన్స్ ఇన్ని దేశాలు తిరగేయొచ్చు!
Henley passport Index: అంతర్జాతీయ విపణిలో ఇండియా ప్రతిష్ఠ నానాటికీ పెరుగుతూ వస్తోంది. వివిధ దేశాలు భారత్ తో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వీసా లేకుండా తమ దేశంలో ప్రయాణించే అవకాశాన్ని ఇండియన్స్ కు ఇస్తున్నాయి.
ప్రపంచంలో శక్తివంతమైన పాస్ పోర్ట్స్ లిస్టును హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఏటా విడుదల చేస్తుంటుంది. 2023కి గాను ఈ జాబితాలో ఇండియన్ పాస్ పోర్ట్ 80వ స్థానంలో నిలిచినట్లు ఆ సంస్థ వెల్లడించింది. దీని ద్వారా భారతీయులు 57 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చని పేర్కొంది. వీసా ఆన్ అరైవల్ ద్వారా ఆయా దేశాల్లో ప్రయాణించవచ్చని తెలిపింది.

గతేడాదితో పోలిస్తే ఇండియన్ పాస్ పోర్ట్ కు హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఈసారి మెరుగైన ర్యాంక్ ఇచ్చింది. భారతీయ పాస్‌పోర్ట్‌కి గతంతో పోలిస్తే మెరుగైన ర్యాంక్‌ని ఇచ్చింది. 7 స్థానాలను మెరుగుపరచుకుని 87 నుంచి 80కి చేరింది. అయితే చైనా, జపాన్, రష్యా, అమెరికా, యూరప్ సహా 177 దేశాలకు వెళ్లేందుకు భారతీయులు వీసా కలిగి ఉండటం తప్పనిసరి.
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2022లో జపాన్ అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ కలిగిన దేశం. కాగా ఇప్పుడు అది మూడో స్థానానికి పడిపోయింది. సింగపూర్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఈ దేశం పాస్ పోర్టు ఉపయోగించి ఏకంగా 192 దేశాల్లో వీసా లేకుండా విహరించి రావచ్చు. దాదాపు పదేళ్ల క్రితం అగ్రభాగాన ఉన్న అమెరికా ఇప్పుడు రెండు స్థానాలు దిగజారి 8కి పరిమితమైంది.


Click it and Unblock the Notifications