డైరెక్ట్ సెల్లింగ్‌లో దూసుకుపోతున్న ఇండియా.. ప్రపంచ మార్కెట్స్‌లో మనదేశ స్థానం ఎంతంటే..
Direct Selling: ఇండియాలో పెద్ద మొత్తంలో ఉద్యోగాలు కల్పించే రంగాల్లో డైరెక్ట్ సెల్లింగ్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగం కొంతవరకు ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అయితే ఈ రంగంలో భారత్ మాత్రం తన స్థానాన్ని మెరుగుపరుచుకోవడం విశేషం. అంతకుముందు ఏడాది తో పోలిస్తే 2022లో మంచి వృద్ధి నమోదు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
2021తో పోలిస్తే గతేడాది 5.4 శాతం భారత్ లో రిటైల్ సేల్స్ పెరిగాయి. ఇదే సమయంలో అంతర్జాతీయంగా 1.5 శాతం వృద్ధి డీలా పడటం విశేషం. ఈ రంగంలో భారత్ 11వ స్థానానికి చేరినట్లు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్(WFDSA) నివేదించింది. 2022లో 26 వేల 852 కోట్లు విలువైన రిటైల్ సేల్స్ తో ఈ ఫీట్ సాధించినట్లు ప్రకటించింది. దీనికి తోడు భారత మార్కెట్లు గత మూడేళ్లుగా హైయెస్ట్ CAGR 13.3 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది.

భారత డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ స్థిరంగా వృద్ధి చెందుతున్నట్లు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ చైర్మన్ రజత్ బెనర్జీ తెలిపారు. రానున్న దశాబ్దంలో టాప్ ఫైవ్ స్థానానికి చేరగలిగే సత్తా మన మార్కెట్ల సొంతమని ధీమా వ్యక్తం చేశారు. కన్జ్యూమర్ ప్రొటెక్ట్ (డైరెక్ట్ సేల్స్) 2021 చట్టం సవరణ ద్వారా ఇండియన్ ఇండస్ట్రీ ఇన్వెస్టర్స్ విశ్వాసం చూరగొన్నట్లు తెలిపారు.
టాప్ 10 లోని సెల్లర్స్ లో కేవలం 3 మాత్రమే ఇండియాలో ఆపరేట్ చేస్తుండగా.. రానున్న రోజుల్లో పది సంస్థలూ భారత్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 40.52 బిలియన్ డాలర్లతో అమెరికా WFDSA నివేదికలో అగ్రస్థానాన్ని సంపాదించింది. అయితే 2021తో పోలిస్తే 2022లో అక్కడ ఈ రంగం వృద్ధి 5 శాతం క్షీణించడం గమనార్హం. కొరియా, జర్మనీ, చైనా, జపాన్, మలేషియాలు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications