Penny Stock: డిసెంబర్ మాసంలో జరిగిన స్టాక్ మార్కెట్ల మెగా ర్యాలీలో పాల్గొన్న షేర్లు తమ పెట్టుబడిదారుల సంపదను అమాంతం పెంచేశాయి. ఈ కోవకు చెందిన ఒక పెన్నీస్టాక్ 20 రోజుల్లోనే మ్యాజిక్ చేసింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఇండియా స్టీల్ వర్క్స్ కంపెనీ షేర్ల గురించే. ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో గడచిన నెల రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. దీనిలో పెట్టుబడులు పెట్టిన చాలా మంది ప్రస్తుతం రోజుల వ్యవధిలోనే ధనవంతులుగా మారిపోయారు. ఈ కంపెనీ ఇనుము, ఉక్కు ఉప్పత్తి వ్యాపారంలో కొనసాగుతోంది. గత కొన్ని సెషన్‌లుగా కొనసాగుతున్న ఫోకస్ కారణంగా షేర్లలో నిరంతర పెరుగుదల నమోదైంది. అలా మూడు వారాల్లోనే ఇన్వెస్టర్ల డబ్బు 100 శాతం పెరిగి రెండింతలైంది.

నెల కిందట ఇండియా స్టీల్ వర్క్స్ షేరు ధర రూ.2 వద్ద ఉంది. అయితే ర్యాలీతో శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి రూ.4.37 వద్ద కొత్త 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.173.96 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది మార్చిలో స్టాక్ ధర కేవలం రూ.1.35 స్థాయి వద్ద తన 52 వారాల కనిష్ఠం వద్ద ఉంది. చివరి ఐదు రోజుల ప్రయాణాన్ని గమనిస్తే స్టాక్ 10 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఏడాది ప్రాతిపధికన స్టాక్ 108 శాతం రాబడిని అందించింది.
కంపెనీ స్టాక్ ధర 28 ఏళ్ల కిందట రూ.75గా ఉంది. ఇండియా స్టీల్ వర్క్స్ నిర్వహణలో కూడా మార్పు వచ్చింది. నాన్ ఎగ్జిక్యూటివ్, ఇండిపెండెంట్ డైరెక్టర్ కేటగిరీలో రత్న దీప్ రంజన్ అడిషనల్ డైరెక్ట్‌గా నియమితులైనట్లు కంపెనీ తెలిపింది. ఈ నియామకం వచ్చే 5 సంవత్సరాల కాలానికి డిసెంబర్ 11 నుండి అమలులోకి వస్తుంది. ఇది ఇప్పుడు వాటాదారుల ఆమోదానికి లోబడి ఉంది.షేర్ హోల్డింగ్ విధానం ప్రకారం ప్రమోటర్ల వాటా 50.11% ఉండగా.. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 49.89 శాతం వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications