For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Aadhaar: మనుషుల్లాగా గేదెలకు ఆధార్ కార్డ్.. వెల్లడించిన ప్రధాని మోదీ.. రైతులకు మేలు..

|

Pashu Aadhaar: ఈరోజు జరిగిన అంతర్జాతీయ పాడిపరిశ్రమ సదస్సులో ప్రధాని మోదీ పొల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన ఆధార్ కార్డు.. కొన్నేళ్లుగా, కోట్లాది మంది భారతీయుల జీవితాల్లో భిన్నమైన మార్పును తీసుకొచ్చింది.

పశుసంపదకూ గుర్తింపుగా..

పశుసంపదకూ గుర్తింపుగా..

కిసాన్ యోజన లేదా మరేదైనా ప్రభుత్వ సహాయం నేరుగా రైతు, పౌరుల ఖాతాకు వచ్చేందుకు ఆధార్ సహకరిస్తోంది. ఇప్పుడు ప్రధానినరేంద్ర మోదీ ఆధార్ కార్డును గేదెలకు సైతం అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు. వినటానికి ఇది కొంత వింతగా ఉన్నప్పటికీ దీని వల్ల రానున్న కాలంలో రైతులకు ఉపయోగం ఉంటుందని తెలుస్తోంది.

పాడి జంతువులకు డేటాబేస్‌..

పాడి జంతువులకు డేటాబేస్‌..

ఈరోజు అంతర్జాతీయ డెయిరీ సదస్సును మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. పాడి పశువులన్నింటికీ ఆధార్ కార్డు తయారు చేస్తామని తెలిపారు. దేశంలో డెయిరీ రంగాన్ని సైన్స్‌తో ముడిపెట్టి విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. పాడి జంతువులకు సంబంధించిన అతిపెద్ద డేటాబేస్‌ను భారత్ రూపొందిస్తోందని ఆయన తెలియజేశారు. డెయిరీ రంగానికి సంబంధించిన ప్రతి జంతువును ట్యాగ్ చేస్తున్నట్లు తెలిపారు.

ఆధార్ పొందటం..

ఆధార్ పొందటం..

ఆధార్ కార్డును రూపొందించడానికి బయోమెట్రిక్ సమాచారం అవసరం. అంటే వేలిముద్రలు, కళ్లు తదితర సమాచారం తీసుకుంటారు. ఈ విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జంతువుల బయోమెట్రిక్ సమాచారాన్ని తీసుకుంటామని మోదీ తెలిపారు. ఈ ప్రచారానికి పశు ఆధార్ అని పేరు పెట్టారు. జంతువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవడంతో పాటు, పాల ఉత్పత్తులకు సంబంధించిన మార్కెట్‌ను విస్తరించేందుకు ఇది దోహదపడుతుందని మోదీ చెబుతున్నారు.

 బన్నీ గేదె...

బన్నీ గేదె...

బన్నీ గేదె గుజరాత్‌లోని కచ్ జాతికి చెందినది. ఈ గేదె గురించి మోదీ ఓ ఉదంతం చెప్పారు. పగటిపూట అక్కడ చాలా వేడిగా ఉంటుంది. దీంతో ఈ గేదె రాత్రి పూట మేస్తుంది. పశుగ్రాసం కోసం ఆవుల కొట్టం నుంచి 15 నుంచి 17 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కానీ రోజు తెల్లవారుజాము ప్రారంభమైన వెంటనే, అది ఆలస్యం చేయకుండా తన ఆవు వద్దకు తిరిగి వస్తుంది. బన్నీ గేదె తప్పుదారి పట్టడం లేదా దారి తప్పిపోవడం గురించి వినడం చాలా అరుదు. విదేశాల్లోని వారు ఈ విషయం వింటే షాక్ అవుతారని ఆయన తెలిపారు.

English summary

Aadhaar: మనుషుల్లాగా గేదెలకు ఆధార్ కార్డ్.. వెల్లడించిన ప్రధాని మోదీ.. రైతులకు మేలు.. | india soon giving pashu aadhaar to animal in country to create data base said pm modi

india soon giving pashu aadhaar to animal in country to create data base said pm modi
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X