జూన్ 1 నుండి సోలార్ కొత్త నిబంధనలు.. కస్టమర్లపై ఎంత భారం పడబోతోంది?

భారతదేశంలో సోలార్ ఎనర్జీని వాడే వారికి, కొత్తగా రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలనుకునే వారికి ఒక ముఖ్యమైన అప్‌డేట్. జూన్ 1 నుండి దేశంలో సోలార్ పాలసీకి సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలు (New Rules) అమల్లోకి తెచ్చింది. చైనా వంటి దేశాల నుండి వచ్చే దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, మన దేశీయ తయారీని (Made in India) బలోపేతం చేయడమే ఈ మార్పు వెనుక ఉన్న అసలు లక్ష్యం. అయితే, ఈ నిర్ణయం వల్ల సోలార్ ఇండస్ట్రీతో పాటు సామాన్య కస్టమర్లపై కూడా ప్రభావం పడనుంది.

India Solar Import New Rules June 1 ALMM Solar Cells Cost Impact Consumers

అసలు ఏం మారింది?

సాధారణంగా సోలార్ ప్యానెల్స్ తయారీలో 'సోలార్ సెల్స్' అనేవి చాలా కీలకం. ఇవే సూర్యరశ్మిని విద్యుత్‌గా మారుస్తాయి. ఇప్పటివరకు మన దేశంలో ప్యానెల్స్ అసెంబ్లింగ్ చేసినా, వాటిల్లో వాడే సెల్స్‌ను ఎక్కువగా చైనా నుండి దిగుమతి చేసుకునేవాళ్లం.

కానీ, జూన్ 1 నుండి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం ఆమోదించిన లిస్ట్ (ALMM List-II) లో ఉన్న భారతీయ కంపెనీలు తయారు చేసిన సోలార్ సెల్స్‌ను మాత్రమే ప్రాజెక్టుల్లో వాడాల్సి ఉంటుంది. నెట్-మీటరింగ్ ద్వారా కనెక్ట్ అయ్యే ఇళ్లపై పెట్టుకునే రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులకు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన 'PM సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన' పథకానికి కూడా ఈ రూల్ వర్తిస్తుంది.

ధరలు ఎంత పెరుగుతాయి?

ఈ కొత్త నిబంధనల వల్ల కస్టమర్లకు ఎదురయ్యే అతిపెద్ద సమస్య 'ఖర్చు'. ప్రస్తుతం చైనా నుండి వచ్చే సోలార్ సెల్స్ కంటే, భారత్‌లో తయారయ్యే సెల్స్ ధర కాస్త ఎక్కువ. దీనివల్ల రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ధర కిలోవాట్‌కు (kW) దాదాపు రూ. 3,000 వరకు పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. ఉదాహరణకు, మీరు మీ ఇంటిపై 5-kW సామర్థ్యం గల సోలార్ సిస్టమ్ పెట్టించాలనుకుంటే.. ఇకపై దాదాపు రూ. 15,000 వరకు అదనంగా జేబులోంచి పెట్టుకోవాల్సి రావచ్చు. అయితే, PM సూర్య ఘర్ పథకం కింద వచ్చే ప్రభుత్వ సబ్సిడీలు యథావిధిగా అందుతాయి. కానీ, ఇకపై పేపర్‌వర్క్, తనిఖీలు మరింత కఠినంగా మారనున్నాయి.

డిమాండ్ ఎక్కువ.. సప్లై తక్కువ!

ప్రస్తుతం మన దేశంలో సోలార్ ప్యానెల్స్ (Modules) తయారు చేసే కెపాసిటీ ఏటా 200 గిగావాట్లు (GW) ఉంటే, సోలార్ సెల్స్ తయారు చేసే కెపాసిటీ కేవలం 25-30 గిగావాట్లు మాత్రమే ఉంది. కానీ, దేశంలో ఏటా సోలార్ సెల్స్ డిమాండ్ 50 గిగావాట్ల వరకు ఉంటోంది. ఈ గ్యాప్‌ను ఇప్పటివరకు దిగుమతుల ద్వారా భర్తీ చేశారు. ఇప్పుడు కొత్త రూల్స్ వల్ల దిగుమతులు ఆగిపోతే, మార్కెట్‌లో సోలార్ సెల్స్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

దీనివల్ల సొంతంగా సెల్స్ తయారు చేయలేని చిన్న చిన్న లోకల్ కంపెనీలు ఇబ్బందుల్లో పడవచ్చు. పెద్ద కంపెనీల చేతికి మార్కెట్ వెళ్లడం వల్ల ధరలపై వారి నియంత్రణ పెరిగే ఛాన్స్ ఉంది.

లాంగ్ టర్మ్‌లో చూస్తే మన దేశం సోలార్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ఈ కొత్త నిబంధనలు (New Rules) ఎంతగానో తోడ్పడతాయి. కానీ, షార్ట్ టర్మ్‌లో మాత్రం ధరల పెరుగుదల రూపంలో కస్టమర్లకు, సప్లై కొరత రూపంలో చిన్న వ్యాపారులకు సవాలుగా మారబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+