Living Wages: దేశంలోని ఉద్యోగస్తులందరికీ కనీసం వేతనం అందించబడేలా ప్రభుత్వం చట్టం చేసింది. అయితే పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణం వల్ల అది ఏమాత్రం సరిపోని పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో నిబంధనల్లో కొన్ని మార్పులు చేయాలని, జీతభత్యాలు పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. సరిగ్గా ఇదే విషయంపై తాజాగా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది.
2025 నాటికి కనీస వేతనం(minimum wage) స్థానంలో జీవన వేతనాన్ని(living wage) అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సాంకేతిక సహాయం అందించాలంటూ అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO)ను కోరింది. సామర్థ్యం పెంపుదల, డేటా సేకరణ మరియు జీవన వేతనాల సానుకూల ఆర్థిక ప్రభావాలను అంచనా వేయడంలో మద్దతివ్వాలని భారత అధికారులు విజ్ఞప్తి చేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.

నివాసం, ఆహారం, ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు దుస్తులు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి అవసరమైన ఆదాయంగా జీవన వేతనం నిర్వచించబడింది. జెనీవాలో ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో ILO ఈ సంస్కరణను ఆమోదించింది. కాగా ఈ వేతనాలు ప్రస్తుత కనీస వేతన స్థాయిలను మించి ఉంటాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. మరో ఏడాదిలో దాన్ని చేరుకుంటామని ఆశిస్తున్నట్లు చెప్పారు.
భారత్‌లో 500 మిలియన్లకు పైగా కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారు. ఈ 90 శాతం మంది రోజువారీ కనీస వేతనం దాదాపు 176 లేదా అంతకంటే ఎక్కువ. అయితే ఆయా రాష్ట్రాలపై ఆధారపడి ఈ మొత్తం మారుతూ ఉంటుంది. అయితే 2017 నుండి స్తబ్దుగా ఉన్న జాతీయ వేతన స్థాయి అన్ని రాష్ట్రాల్లో అమలులో లేకపోవడం జీతాల చెల్లింపులలో వ్యత్యాసాలకు దారితీసింది.
వేతనాలపై కోడ్ 2019లో ఆమోదించబడినా అమలు మాత్రం ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. ఇది కనుక అమల్లోకి వస్తే అన్ని రాష్ట్రాలకు వర్తించే సార్వత్రిక వేతన స్థాయిని కేంద్రం ప్రతిపాదిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా భారత్ 1922 నుండి ILO వ్యవస్థాపక సభ్యునిగా కొనసాగుతోంది. 2030 నాటికి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను నెరవేర్చడానికి, పేదరిక నిర్మూలన వేగవంతం చేయడానికి కట్టుబడి ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications