IPO News: తొలిరోజే ఐపీవోలో భారీ మోసం.. నిరాశలో పెట్టుబడిదారులు.. మీరూ కొన్నారా..??
India Shelter IPO: ఈ రోజు స్టాక్ మార్కెట్లో జాబితా అయిన రెండవ కంపెనీ ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐపీవో షేర్ల గురించే. ఈ ఐపీవో నేడు మార్కెట్లో బలమైన జాబితాను నమోదు చేసింది. ఈ క్రమంలో 25.7 శాతం ప్రీమియంతో జాబితా చేయబడింది. ఎన్ఎస్ఈలో రూ.620 రేటు వద్ద లిస్టింగ్ జరగగా.. బీఎస్ఈలో రూ.612.70 వద్ద జాబితా అయ్యాయి. వాస్తవానికి కంపెనీ షేర్ల ఇష్యూ గరిష్ఠ ధర రూ.493గా ఉంది.

అయితే లాభాలతో జాబితా అయిన ఐపీవో స్టాక్ కొద్ది సేపటికే 10 శాతానికిపైగా భారీ పతనాన్ని చవిచూసింది. ప్రధానంగా షేర్లను పొందిన ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో ఎన్ఎస్ఈలో స్టాక్ ధర రూ.551కి బీఎస్ఈలో రూ.551కి పడిపోయింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి ఏకంగా రూ.1,200 కోట్లను సమీకరించింది. ఈ క్రమంలో సబ్‌స్క్రిప్షన్ కోసం ఐపీవోను డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 18 వరకు తెరచి ఉంది.
ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఐపీవోపై విపరీతమైన ఆసక్తిన కనబరిచారు. కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.360 కోట్లు సమీకరించింది. గోల్డ్‌మన్ సాచ్స్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, NHIT, స్టెయిన్‌బర్గ్ ఇండియా వంటి ప్రధాన పేర్లతో సహా ముప్పై ఎనిమిది మంది పెట్టుబడిదారులు ఇందులో పాల్గొన్నారు.
ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది రిటైల్-ఫోకస్డ్ సరసమైన హౌసింగ్ ఫైనాన్స్ రుణాలిచ్చే కంపెనీ. ఇది ప్రధానంగా తక్కువ, మధ్య ఆదాయ కేటగిరీ కస్టమర్లకు టైర్-2, టైర్-3 నగరాల్లో వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. కంపెనీ 15 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న 203 శాఖల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌లలో గణనీయమైన ఉనికిని కలిగి ఉంది. కంపెనీ FY23లో రూ.155.3 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఇది అంతకుముందు ఏడాది కంటే 21 శాతం అధికం.


Click it and Unblock the Notifications