రాబోయే 2026 సంవత్సరంలో భారతదేశంలోని కంపెనీలలో ఉద్యోగుల జీతాల పెరుగుదల శాతం తక్కువగా ఉండవచ్చని ఓ తాజా సర్వే సూచిస్తోంది. అలాగే ఉద్యోగులు జాబ్స్ మారే రేటు కూడా ఎక్కువగానే ఉంటుందని ఒక అంచనా. దీని గురించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే..
2026 అంచనాలు
హెచ్‌ఆర్ కన్సల్టింగ్ సంస్థ OMAM విడుదల చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం 2026లో ఉద్యోగుల సగటు జీతం పెరుగుదల తగ్గనుందట. గతంలో పెరుగుదల రేటు 9.1% ఉండగా ఇది 2026లో 8.9% వరకు తగ్గుతుందని అంచనా. అలాగే ఉద్యోగులు.. ఉద్యోగాలు మారే శాతం దాదాపు 13.6% వరకూ ఉండొచ్చని అంచనా. ఆర్థిక అనిశ్చితి, కొన్ని రంగాలు వెనుకబడడం అలాగే కంపెనీలు ప్రతిభ ఆధారంగా మాత్రమే జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకోవడం వంటి కారణాల వల్ల కంపెనీలు తమ శాలరీ బడ్జెట్‌లను తగ్గిస్తున్నాయని ఈ సర్వే తెలిపింది.

ఏ రంగాల్లో ఎలా..?
ఐటీ, ఇ-కామర్స్, ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్ వంటి రంగాల్లో శాలరీ ఇంక్రిమెంట్స్ తగ్గుదల స్పష్టంగా కనిపిస్తుంది. ఐటీలో 2025లో జీతాల పెరుగుదల 8.2 శాతం ఉంటే 2026లో 7 శాతం మాత్రమే పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా. ఇ-కామర్స్ రంగంలో 2025లో పెరుగుదల శాతం10 గా ఉంటే .. 2026లో ఇది 9.2 శాతం మాత్రమే ఉంటుందని అంచనా. అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో 2025 జీతాల పెరుగుదల శాతం 9.5గా ఉంటే వచ్చే ఏడాది 8.7 మాత్రమే ఉండే అవకాశం ఉంది. అలాగే ఆటోమొబైల్ రంగంలో గతేడాది జీతాల పెరుగుదల శాతం10.5 ఉంటే 2026లో 9.8 శాతం ఉండే అవకాశం ఉంది.
స్థిరంగా ఉన్న రంగాలు
ఇక వీటితోపాటు కోర్ ఇండస్ట్రియల్ సెక్టార్స్‌లో కూడా పెరుగుదల 9.0% నుంచి 8.7% కి తగ్గనుంది. అలాగే కెమికల్ సెక్టార్‌లో కూడా 9.5% నుంచి 9.0% కి తగ్గుతుందని అంచనా. ఇకపోతే ఇన్సూరెన్స్ రంగంలో జీతాల పెరుగుదల 9% వద్ద స్థిరంగా ఉండొచ్చు. టెలికాం రంగంలో మాత్రమే 9% నుంచి 9.1% కి స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది.
కారణాలివే..
జీతాల పెంపుదల తగ్గడానికి ప్రధాన కారణం, కంపెనీలు తమ విధానాన్ని మార్చుకోవడమే. కంపెనీలు ఇప్పుడు బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తున్న వారికి మాత్రమే పెద్ద మొత్తంలో జీతం పెంచుతున్నాయి. సాధారణ ఉద్యోగుల పెంపుదలను తగ్గిస్తున్నాయి. అలాగే ఫిక్స్ డ్ శాలరీ పెంచడం కంటే ఇతర ప్రయోజనాలు అందించడానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. దీంతోపాటు కెరీర్ డెవలప్‌మెంట్ కోసం కూడా నిధులను ఖర్చు చేస్తున్నాయి.
ఉద్యోగాలు మారే సమస్య
జీతాల పెరుగుదల సంగతి అటుంచితే.. ఉద్యోగులు ఉద్యోగాలు మారే సమస్య మాత్రం కొనసాగుతోంది. 2026లో ఈ రేటు 13.6% గా ఉండనుంది. జీతంలో తేడాలు, కెరీర్ వృద్ధి లేకపోవడం, వర్క్ కల్చర్, అధిక పనిభారం వంటి కారణాల వల్ల ఉద్యోగులు ఉద్యోగాలు మారుతున్నట్టు సర్వే ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు మారే రేటు ఎక్కువగా ఉండనుంది. ఐటీలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్, మరియు ఈ-కామర్స్ వంటివాటిలో కూడా ఈ తరహా ట్రెండ్ కనిపిస్తుంది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications