భారతదేశం పండుగ హడావిడిని ముగించుకున్న వెంటనే దేశవ్యాప్తంగా మరో కొత్త జోష్ మొదలైంది.. అదే వివాహాల సీజన్. ప్రతి నగరంలో హోటల్ లాన్‌లు కిక్కిరిసిపోవడం, ఆభరణాల దుకాణాల్లో రద్దీ పెరగడం, షేర్వానీలు-చీరల విక్రయాలు పీక్‌కు చేరుకోవడం, ఈ సీజన్ బలాన్ని మరింతగా చేస్తోంది. TOI నివేదిక ప్రకారం.. ఈ షాదీ సీజన్ భారత వినియోగ వ్యయాలను గణనీయంగా పెంచుతూ, రిటైలర్లకు, హాస్పిటాలిటీ రంగానికి, ఫ్యాషన్, జ్యువెలరీ బ్రాండ్లకు భారీ వ్యాపారం తెస్తోంది.
కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా ప్రకారం చూసినట్లయితే.. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 14 వరకు 46 లక్షల వివాహాలు జరగనున్నాయి. ఈ సీజన్‌లోనే రూ. 6.5 లక్షల కోట్లు వ్యయం జరగనున్నట్లు వారు తెలిపారు. దీంతో అన్ని రంగాల వ్యాపార సంస్థలు భారీ డిమాండ్‌కు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

దుస్తుల విభాగం: టెక్స్టైల్ దుస్తుల విభాగం కూడా ఇదే ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తోంది. రేమండ్ సంస్థ ప్రకారం.. ఈ సీజన్‌లో కుర్తా సెట్ల విక్రయాలు రూ. 1,499 నుంచే ప్రారంభమవుతున్నాయి, ఇక ప్రీమియమ్ బ్రాండెడ్ షేర్వాణీలు రూ. 85 వేల వరకు అమ్ముడవుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్ల నుండి వచ్చే బుకింగ్‌లు అంతగా పెరగడంతో కొంతమంది డీలర్లు ముందుగానే స్టాక్ డెలివరీలు కోరుతున్నారని కంపెనీ వెల్లడించింది.
డెస్టినేషన్ వెడ్డింగ్‌లు: అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్‌లు కూడా పెద్ద ఎత్తున పెరిగాయి. జిమ్ కార్బెట్‌లోని ది రివర్‌వ్యూ రిట్రీట్ వంటి హోటల్‌లు ఈ సీజన్ మొత్తం ఫుల్ బుకింగ్‌లతో నిండిపోయాయి. లీజర్ హోటల్స్ గ్రూప్ ఈ సీజన్‌లో మాత్రమే దాదాపు రూ. 15 కోట్ల వివాహ ఆదాయం రానుందని అంచనా వేస్తోంది. ఇది గత సంవత్సరం నమోదు చేసిన ఆదాయంతో పోలిస్తే స్పష్టమైన వృద్ధి. ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్‌లు రూ. 90 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.
హాస్పిటాలిటీ రంగం: మారియట్ ఇంటర్నేషనల్, ఐటీసీ హోటల్స్ వంటి ప్రముఖ హాస్పిటాలిటీ చైన్‌లు కూడా ఈ ఏడాది విచారణలు, బుకింగ్‌లు భారీగా పెరిగాయని చెబుతున్నాయి. లగ్జరీ వివాహాలు సగటున రూ. 1.3 కోట్లు, అంతకంటే ఎక్కువ ఖర్చుతో జరుగుతుండగా, మధ్యస్థ వర్గ వివాహాల ఖర్చు రూ. 35 లక్షల నుంచి రూ.80 లక్షల మధ్యలో ఉంది.
జ్యువెలర్స్ మార్కెట్: ఆభరణాల వినియోగంలో కూడా పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. అంగారాలో కస్టమర్లు ఈసారి ఎక్కువగా 18 క్యారెట్ బంగారం, పెద్ద వజ్రాల డిజైన్లను కోరుతున్నారని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. లోహ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, వినియోగదారుల ఖర్చు తగ్గలేదని వారు తెలిపారు. రిలయన్స్ జ్యువెలర్స్, కళ్యాణ్ వంటి బ్రాండ్లు కూడా పెద్ద మోతాదులో జ్యువెలరీ సేల్స్‌ను నమోదు చేస్తున్నాయి. మొత్తం వివాహ బడ్జెట్‌లో ఆభరణాల ఖర్చు సగటున 15 శాతం ఉంటుందని అంచనా.
ఫ్యాషన్, టెక్స్టైల్ రంగం: ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాలు అత్యధిక డిమాండ్‌ను సృష్టిస్తున్నాయి. తూర్పు భారతదేశంలో డిమాండ్ డిసెంబర్ చివరి వారాల్లో పెరుగుతుందని రిటైలర్లు భావిస్తున్నారు. చీరల విభాగంలో 'రీగల్ & టైమ్‌లెస్' డిజైన్లను వినియోగదారులు ఎక్కువగా ఎంపిక చేస్తున్నారని ఎథ్నిక్ బ్రాండ్లు తెలిపాయి. తస్వా, TCNS, Fabindia, Ekaya Banaras వంటి లగ్జరీ ఎథ్నిక్ బ్రాండ్లు 10 నుంచి 15 శాతం వృద్ధి లక్ష్యంగా ఈ సీజన్‌లో బలంగా ముందుకు సాగుతున్నాయి.
ఫుట్‌వేర్ నుంచి సలూన్ సేవల వరకు వివాహ మార్కెట్ యొక్క ప్రతి విభాగంలో వ్యాపారం పెరిగింది. మొత్తం వివాహాలు, పండుగల ఖర్చులను కలుపుకొని, కన్స్యూమర్ వ్యయం రూ. 12 లక్షల కోట్ల నుంచి రూ. 14 లక్షల కోట్లు ఉంటుందని బ్యాంక్ ఆఫ్ బరోడా విశ్లేషణ చెబుతోంది. అందులో వివాహ ఖర్చులు మాత్రమే రూ. 4.5 లక్షల కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్లు కావడం ప్రత్యేకమైన విషయం.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పండుగల తర్వాత వచ్చే ఈ భారీ Wedding సీజన్ భారత ఆర్థిక వ్యవస్థకు మూడవ త్రైమాసికంలో గొప్ప బూస్ట్ ఇవ్వనుంది. సెప్టెంబర్-డిసెంబర్ మధ్య కాలంలో వచ్చిన డిమాండ్ వృద్ధి కారణంగా Q3 GDP దాదాపు 7 శాతం వరకు చేరే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..



Click it and Unblock the Notifications