ఆన్‌లైన్ గ్రాసరీ కంపెనీ బిగ్ బాస్కెట్‌లో ప్రముఖ దేశీయ కంపెనీ టాటా సన్స్ మెజార్టీ వాటాను సొంతం చేసుకుంది. ఆన్‌లైన్ వ్యాపారంలోకి టాటా సన్స్ ప్రవేశించే ప్రయత్నాలు చేస్తోందని, ఇందుకు సంబంధించి బిగ్ బాస్కెట్‌తో చర్చలు జరుపుతోందని కొద్ది నెలల క్రితం వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ కొనుగోలు ప్రక్రియకు సంబంధించి స్పష్టత వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్కెట్‌లో మెజార్టీ వాటాను సొంతం చేసుకుంది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్ వంటివి ఆన్‌లైన్ వ్యాపారంలో దూసుకెళ్తున్నాయి. ఈ సంస్థలకు టాటా సన్స్ ఇక గట్టి పోటీ ఇవ్వనుంది. టాటా సన్స్‌కు చెందిన టాటా డిజిటల్... బిగ్‌బాస్కెట్‌లో వాటాలను సొంతం చేసుకుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన ఇతర వివరాలను కంపెనీలు ప్రకటించాల్సి ఉంది.

బిగ్ బాస్కెట్‌లో వాటాల కొనుగోలుకు భారత కాంపిటిషన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా గత నెలలోనే ఆమోద ముద్ర వేసింది. దీంతో బిగ్ బాస్కెట్‌ను నిర్వహిస్తున్న సూపర్ మార్కెట్ గ్రాసరీ సప్లైస్ ప్రయివేట్ లిమిటెడ్‌లో 64.3 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు మార్గం సుగమమైంది.
బిగ్ బాస్కెట్‌లో చైనా కుబేరుడు జాక్‌మాకు చెందిన అలీబాబా కంపెనీకి 29 శాతం వాటా ఉంది. వాటిని విక్రయించి బయటకు వెళ్లిపోవాలని అలీబాబా చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. బిగ్ బాస్కెట్‌లో ఆది గోద్రెజ్‌కు 16.3 శాతం వాటా ఉంది. 2019లో 1.9 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ సంస్థ 2020 చివరి నాటికి 3 బిలియన్ డాలర్ల వ్యాల్యూను తాకింది. 2024 నాటికి ఈ సంస్థ 18 బిలియన్ డాలర్ల మార్కును తాకుతుందని అంచనా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications