గూగుల్ భారతదేశంలో తయారుచేసిన AI వ్యవసాయ టూల్స్‌ను ఇప్పుడు మరిన్ని ఆసియా దేశాలకు తీసుకెళ్తోంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ALU (Agricultural Landscape Understanding) మరియు AMED (Agricultural Monitoring & Event Detection) అనే రెండు AI టూల్స్‌ను ఇప్పుడు మలేషియా, వియత్నాం, ఇండోనేషియా, జపాన్ దేశాల్లో కూడా పరీక్షిస్తున్నారు.
ఈ టూల్స్ మొదట భారత్‌లోనే అభివృద్ధి చేయబడ్డాయి, ఇప్పుడు అవి ఇతర దేశాలకు విస్తరించడం గూగుల్ వ్యవసాయ రంగాన్ని మరింత టెక్నాలజీ ఆధారంగా, స్థిరంగా మార్చాలనే ప్రయత్నంలో భాగం.

గూగుల్ ప్రకారం, ఈ విస్తరణ "AIని వాస్తవ ప్రపంచ సమస్యల పరిష్కారానికి ఉపయోగించడం" అనే పెద్ద మిషన్‌లో భాగం. భారత్‌లో ఈ మోడళ్లను ఉపయోగించిన తర్వాత కంపెనీ గమనించింది టెక్నాలజీ ద్వారా రైతులు వేగంగా, ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. గూగుల్ చెబుతున్నది ఒక్కటే "భారతదేశంలోని సవాళ్లకు పరిష్కారం కనుక్కోగలిగితే, ప్రపంచంలోని అనేక దేశాలకు కూడా అది ఉపయోగపడుతుంది."
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు భారత వాతావరణం, వ్యవసాయ పరిస్థితులు దాదాపు సమానంగా ఉండటంతో, ఈ టూల్స్ అక్కడ కూడా బాగా పని చేస్తాయని గూగుల్ నమ్ముతోంది.
ALU, AMED అంటే ఏమిటి?
ఈ రెండు APIలు రిమోట్ సెన్సింగ్ (remote sensing) మరియు మెషీన్ లెర్నింగ్ ఆధారంగా వ్యవసాయ పరిస్థితులను అర్థం చేసుకుంటాయి. ALU API ప్రధానంగా రైతులు ఉపయోగించే భూములు, పంటల ఆకారాలు, చెట్లు, నీటి వనరులు ఎక్కడ ఉన్నాయో గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అంటే, వ్యవసాయ భూమి, పొలాలు, సరస్సులు, చెరువులు వంటి ప్రాంతాలను డేటా ఆధారంగా చూపిస్తుంది. ఇది రైతులు తమ భూభాగాన్ని, పంటల స్థితిని సమీక్షించుకోవడానికి, అలాగే నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవడానికి సహాయపడుతుంది.
AMED API పంటల పెరుగుదల దశలను, ఎప్పుడు విత్తబడ్డాయి, ఎప్పుడు కోతకు సిద్ధమవుతాయి అనే వివరాలను పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా, ఎక్కడ వరదలు, ఎండలు, ఎటువంటి వాతావరణ సమస్యలు తలెత్తుతున్నాయో కూడా గుర్తిస్తుంది. ఈ రెండు APIల డేటా ప్రతి 15 రోజులకు ఒకసారి అప్డేట్ అవుతుంది. అంటే, రైతులు, అధికారులు వ్యవసాయ పరిస్థితులపై సుమారుగా "రియల్ టైమ్" సమాచారాన్ని పొందగలరు. ఈ విధంగా వారు పంటల ఆరోగ్యం, నీటి వినియోగం, వాతావరణ పరిస్థితులను బట్టి సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు..
భారత్‌లో ఎలా ఉపయోగిస్తున్నారు?
గూగుల్ టూల్స్ ఇప్పటికే భారత్‌లో కొన్ని ముఖ్య ప్రాజెక్టుల్లో ఉపయోగంలో ఉన్నాయి. ఉదాహరణకు, Krishi DSS ప్లాట్‌ఫారమ్‌లో పంట ఆరోగ్యం, నీటి వినియోగ సూచనలు, వాతావరణ ప్రభావాలను విశ్లేషించడానికి ALU మరియు AMED APIలను వాడుతున్నారు. అలాగే, Vassar Labs 1 కోట్లకుపై రైతులకు సేవలందిస్తూ, తన fieldWISE ప్లాట్‌ఫారమ్‌లో ఈ APIల ద్వారా నీటి పారుదల, ఎరువులు, పురుగుమందులపై స్థానిక సలహాలను అందిస్తోంది.
ఫిన్‌టెక్ కంపెనీ Sugee.io రైతుల రుణాలను ప్రాసెస్ చేసే సమయంలో ALU APIతో భూమి, పంట డేటాను ధృవీకరిస్తోంది. రాబోయే రోజుల్లో AMED డేటాను కూడా ఉపయోగించి, రైతుల క్రెడిట్ రిస్క్ విశ్లేషణను మెరుగుపరచాలని భావిస్తోంది. అలాగే Council on Energy, Environment and Water (CEEW) సంస్థ ఈ APIల సహాయంతో పంట వైవిధ్యానికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తిస్తోంది. దీని వల్ల రైతులు పర్యావరణానికి మేలు చేసే, లాభదాయకమైన పంటల వైపు మార్చుకోగలుగుతున్నారు.
ఇక గూగుల్ లక్ష్యం ఏమిటి?
ఇప్పటివరకు భారత్‌లో సక్సెస్ అయిన ఈ మోడళ్లను ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని మరిన్ని దేశాలకు తీసుకెళ్లడం ద్వారా, గూగుల్ వ్యవసాయ రంగంలో ఇన్నోవేషన్, డేటా ఆధారిత నిర్ణయాలను ప్రోత్సహించాలనుకుంటోంది. కంపెనీ ఆశ ఏమిటంటే డెవలపర్లు, పరిశోధకులు, అగ్రి-బిజినెస్‌లు ఈ మోడళ్లను ఉపయోగించి కొత్త యాప్‌లు, సొల్యూషన్‌లు తయారు చేసి రైతుల ఆదాయాన్ని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడం. భారతదేశంలో పుట్టిన ఈ AI టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రైతులకు సహాయపడే దిశగా సాగుతోంది. గూగుల్ చూపిస్తున్న సందేశం ఒక్కటే "స్థానిక పరిశోధన కూడా ప్రపంచానికి మార్గదర్శకమవచ్చు."
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications