భారతదేశంలో సెమీకండక్టర్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అంచనాల ప్రకారం.. 2030 నాటికి భారత సెమీకండక్టర్ మార్కెట్ విలువ USD 100-110 బిలియన్ డాలర్లు (రూ.9-10 లక్షల కోట్లు) చేరనుందని అంచనా. ఇది 2023లో ఉన్న 38 బిలియన్ డాలర్లు, 2025లో అంచనా వేసిన 45 నుంచి 50 బిలియన్ డాలర్లతో పోలిస్తే గణనీయమైన వృద్ధిగా చెప్పవచ్చు.
చిప్ తయారీకి అవసరమైన అల్ట్రా-హై ప్యూరిటీ కెమికల్స్, వాయువులు, ప్రాసెస్ మెటీరియల్స్ లేకపోతే ఫ్యాబ్‌లు పనిచేయవు. ఈ రంగంలో భాగాలు పార్ట్స్-పర్-బిలియన్ (ppb) స్థాయి స్వచ్ఛత, దీర్ఘకాల అర్హత పరీక్షలు, అధునాతన సాంకేతిక నైపుణ్యం అవసరం. చారిత్రాత్మకంగా ఈ విభాగం కొద్ది గ్లోబల్ కంపెనీల ఆధిపత్యంలో ఉంది. అయితే జియోపాలిటికల్ రిస్క్‌లు, చైనా మీద ఆధారపడకుండా సరఫరా గొలుసులను విభిన్నీకరించాలనే ప్రపంచ ప్రయత్నాలు, భారత కంపెనీలకు పెద్ద అవకాశాలను తెచ్చాయి. ఈ నేపథ్యంలో మూడు భారతీయ కంపెనీలు నిశ్శబ్దంగా కీలక పాత్ర పోషిస్తున్నాయి.

అకుటాస్ కెమికల్స్: గతంలో అమీ ఆర్గానిక్స్‌గా ప్రసిద్ధి చెందిన అకుటాస్ కెమికల్స్.. ప్రత్యేక రసాయనాల రంగంలో బలమైన స్థానం సంపాదించింది. కంపెనీ ఆదాయంలో ప్రధాన భాగం అడ్వాన్స్‌డ్ ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియేట్స్ (API) నుంచే వస్తున్నప్పటికీ, ఇప్పుడు బ్యాటరీ కెమికల్స్, సెమీకండక్టర్స్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది.
అకుటాస్ ప్రస్తుతం భారతదేశంలో సెమీకండక్టర్-గ్రేడ్ ఫోటోరెసిస్ట్ కెమికల్స్ తయారు చేస్తున్న ఏకైక సంస్థ. FY23లో బాబా ఫైన్ కెమికల్స్‌లో 55 శాతం వాటా కొనుగోలు చేసి ఈ రంగంలోకి ప్రవేశించింది. అంతేకాదు.. దక్షిణ కొరియాలో J & Materialsతో జాయింట్ వెంచర్ ద్వారా గ్లోబల్ మార్కెట్‌లోనూ తన పాదముద్రను విస్తరించింది. ఆర్థికంగా కూడా కంపెనీ బలంగా ఉంది. ఆదాయం, EBITDA, లాభాలు వేగంగా పెరుగుతున్నాయి. చైనాకు ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం ప్రపంచ కంపెనీలు చూస్తున్న సమయంలో భారత్ నుంచి అకుటాస్ మంచి స్థితిలో ఉంది.
ఆర్కియన్ కెమికల్స్: ఆర్కియన్ కెమికల్స్ భారతదేశంలోని ప్రముఖ బ్రోమిన్, ఇండస్ట్రియల్ సాల్ట్ తయారీదారు. అయితే అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే కంపెనీ ఇప్పుడు సిలికాన్ కార్బైడ్ (SiC) సెమీకండక్టర్ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఒడిశాలో భారతదేశపు తొలి వాణిజ్య SiC సెమీకండక్టర్ తయారీ సౌకర్యాన్ని ఆర్కియన్ నిర్మిస్తోంది. ఈ ప్లాంట్ EVలు, రక్షణ, డేటా సెంటర్లు, సౌర విద్యుత్ వంటి రంగాలకు కీలకంగా ఉంటుంది. ప్రపంచ SiC మార్కెట్ 2030 నాటికి వేగంగా పెరుగుతుందని అంచనా ఉండటంతో, ఇది దీర్ఘకాలిక వ్యూహాత్మక అడుగుగా చెప్పవచ్చు.
స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్: స్టాలియన్ ఇండియా రిఫ్రిజెరెంట్, పారిశ్రామిక వాయువుల రంగంలో దూసుకుపోతున్న కంపెనీ. ఇప్పుడు కంపెనీ సెమీకండక్టర్-గ్రేడ్ గ్యాసులు, ముఖ్యంగా లిక్విడ్ హీలియంపై దృష్టి పెడుతోంది. సెమీకండక్టర్ తయారీకి అవసరమైన 6N స్వచ్ఛత (99.9999%) ప్రమాణాలను అందుకునేందుకు స్టాలియన్ భారీ పెట్టుబడులు పెడుతోంది. ఆదాయం, లాభాలు వేగంగా పెరుగుతున్నాయి, రాబోయే సంవత్సరాల్లో 30 నుంచి 35 శాతం CAGR లక్ష్యంగా పెట్టుకుంది.
ఏదేమైనా భారత సెమీకండక్టర్ బూమ్ అనేది కేవలం ఫ్యాబ్‌ల కథ కాదు. కెమికల్స్, గ్యాసులు, మెటీరియల్స్ వంటి కీలక ఇన్‌పుట్‌లలో అకుటాస్, ఆర్కియన్, స్టాలియన్ లాంటి కంపెనీలు హిడెన్ జెమ్స గా ఎదుగుతున్నాయి. ఈ సరఫరా గొలుసు బలం ఇంకా పెరిగినప్పుడే భారతదేశం నిజమైన గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మారగలదు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications