Axis Bank Q4 Results: దేశీయ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ ఈరోజు తన నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. అయితే ఈ ఫలితాలను చూసిన చాలా మంది నోరెళ్లబెడుతున్నారు.
అవును ప్రైవేటు దిగ్గజ రుణదాత యాక్సిస్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏకంగా రూ.5,728.42 కోట్లు నష్టాన్ని నమోదు చేసింది. అయితే దీనిని చూసిన చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అసలు లాభాల్లో ఉండాల్సిన బ్యాంక్ ఎందుకు ఇంత భారీ నష్టాలను నమోదు చేసిందోనని అర్థం కాక గందరగోళానికి గురవుతున్నారు.

గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో దిగ్గజ బ్యాంక్ రూ.4,117.77 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్.. నికర వడ్డీ ఆదాయం, ఆర్జించిన వడ్డీకి- ఖర్చు చేసిన వడ్డీకి మధ్య వ్యత్యాసం ఏడాది ప్రాతిపదికన 33.1 శాతం పెరిగి త్రైమాసికానికి రూ.11,742.2 కోట్లకు చేరుకుంది. అయితే తాజా నష్టాలకు సిటీ బ్యాంక్ ఇండియా కన్స్యూమర్ బిజినెస్ కొనుగోలు చేయటమే ప్రధాన కారణమని వెల్లడించింది.
బ్యాంక్ నివేదించిన ఖర్చులను పరిశీలిస్తే.. సిటీ ఇండియా కన్స్యూమర్ బిజినెస్ కొనుగోలుకు సంబంధించి వన్-టైమ్ స్టాంప్ డ్యూటీ కోసం రూ.179.27 కోట్లను వెచ్చించింది. దీనికి తోడు ఆర్థిక నివేదికల తయారీలో ఉపయోగించే ప్రొవిజనింగ్, వ్యయ విధానాలు మరియు/లేదా అంచనాల సమన్వయం కోసం రూ.361.47 కోట్లు ఖర్చు చేసినట్లు బ్యాంక్ తెలిపింది.

మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ వడ్డీయేతర ఆదాయం రూ. 4,895.3 కోట్లుగా నమోదు చేసింది. అదే కాలానికి ప్రీ-ప్రొవిజన్ నిర్వహణ లాభం 41.8 శాతం పెరిగి రూ.9,167.6 కోట్లకు చేరుకుంది. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో లాభం 26.5 శాతం క్షీణించి రూ.9,580 కోట్లకు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే నికర వడ్డీ ఆదాయం 30 శాతం పెరిగి రూ.42,946 కోట్లకు చేరుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.1 తుది డివిడెండ్‌ను బోర్డు సిఫార్సు చేసినట్లు బ్యాంక్ తెలిపింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications