ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యా మీద విధిస్తున్న ఆంక్షల వల్ల అంతర్జాతీయ మందగమనం ఏర్పడే పరిస్థితి లేదు. ఇందుకు కారణం ఈ రెండు దేశాల ప్రపంచ స్థూల దేశీయ ఉత్పత్తిలో రెండు శాతం వాటా కంటే తక్కువగా ఉంది. అలాగే, చాలా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉన్నాయి. ఇటీవల కరోనా నుండి క్రమంగా పుంజుకుంటున్నాయి. అయితే కొన్ని దేశాలు, పరిశ్రమలపై తాజా పరిణామాలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని, ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తాయని అంటున్నారు. లక్షలాదిమంది ఇబ్బంది పడతారు.

ధరలు పెరిగే అవకాశం
ప్రపంచంలో మూడో అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తిదారు, సహజవాయు ప్రధాన ఎగుమతిదారు రష్యా. ఉక్రెయిన్ నుండి వ్యవసాయ ఆహార ఉత్పత్తుల్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద గోధుమ పంట ఎగుమతిదారు. సన్ ఫ్లవర్ ఆయిల్స్ ఎగుమతిలోను ముందు ఉంది. ఇవి నిలిచిపోతే ఆహార ధరలు భారీగా పెరిగే అవకాశముంది. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మనవద్ద నూనె ధరలు పెరిగాయి.

ఐరోపా ఆర్థిక రికవరీకి చిక్కులు
వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కరోనా తగ్గిన నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచాలని భావిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్లపై పెంపుపై పునరాలోచన చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, ప్రస్తుత రష్యా - ఉక్రెయిన్ యుద్ధం యూరోప్ ఆర్థిక రికవరీపై ప్రభావం చూపవచ్చు. ఇప్పటికే అక్కడ చమురు ధరలు గరిష్టాల వద్ద ఉన్నాయి. రష్యా నుండి నలభై శాతం సహజ వాయువును ఐరోపా పొందుతోంది. ఈ వనరుల సరఫరాలో ఇబ్బందులు కలిగితే ఆర్థిక వ్యవస్థకు చిక్కులు తప్పవు.

ధరలు పెరిగి తగ్గుదల...
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఇటీవల తగ్గుతున్నాయి. నాలుగు రోజుల క్రితం 100 డాలర్లను కూడా క్రాస్ చేసింది. ప్రస్తుతం వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 91.93 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ 94.51 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

చమురు బిల్లు భారం
పెరిగిన చమురు ధరల నేపథ్యంలో భారత్‌పై గత ఏడాదితో పోలిస్తే బిల్లు రెండింతలు అయ్యే అవకాశాలున్నాయి. మార్చి 31వ తేదీ నాటికి బిల్లు 100 బిలియన్ డాలర్లు దాటనుందని తెలుస్తోంది. అంతర్జాతీయ ముడిధరలు పెరగడమే ఇందుకు కారణం. గత ఏడాది ఇదే నెలలో చమురు దిగుమతులకు భారత్ 7.7 బిలియన్ డాలర్లు వెచ్చించింది. కానీ జనవరి నెలలో ఏకంగా 11.6 బిలియన్ డాలర్లు చెల్లించవలసి వచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరిలో బ్యారెల్ చమురు ధర 90 డాలర్ల నుండి 100 డాలర్లు దాటిన నేపథ్యంలో ఈ బిల్లు 115 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునని అంచనా.
More From GoodReturns

పెట్రోల్, డీజిల్ పన్ను తగ్గింపు.. 15 రోజుల్లో కేంద్రానికి రూ. 7 వేల కోట్లు నష్టం..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

LPG సిలిండర్ల కొరత ఉందా? అసలు నిజం చెప్పిన ప్రభుత్వం.. సోషల్ మీడియా వార్తలను నమ్మకండి!

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications