GDP News: యూఎస్ వెనుకే ఇండియా.. గరిష్ఠానికి మార్కెట్ క్యాప్-టు-జీడీపీ నిష్పత్తి.. కొనదగిన స్టాక్స్
Stock Markets: భారత స్టాక్ మార్కెట్లు పెరుగుతున్న వేళ ఒక పక్క ఇన్వెస్టర్లలో సంతోషం పెరుగుతుండగా.. మరో పక్క ఆందోళనలూ పెరుగుతున్నాయి.
ప్రస్తుతం దేశీయ ఈక్విటీ మార్కెట్లో కొనసాగుతున్న ర్యాలీ మధ్య మార్కెట్ క్యాప్ టూ జీడీపీ నిష్పత్తి 120 శాతానికి చేరుకుంది. ఇదే క్రమంలో అమెరికా మార్కెట్ నిష్పత్తి 155 శాతంగా, జపాన్ నిష్పత్తి 103 శాతం గా ఉండగా.. చైనా విషయంలో ఇది 81 శాతంగా ఉంది. జనవరి 5న బీఎస్ఈ లిస్టెడ్ సంయుక్త మార్కెట్ విలువ రూ.369.33 లక్షల కోట్లకు చేరుకుంది. జనవరి 5, 2022లో ఇది 31 శాతం తక్కువగా రూ.281.95 లక్షల కోట్లుగా ఉంది. భారీ ర్యాలీ వల్ల కంపెనీల విలువలు తారాస్థాయికి చేరుకున్నాయని అందువల్ల రానున్న కాలంలో మార్కెట్లు కొంత కరెక్షన్‌ను చూసేందుకు సిద్ధంగా ఉన్నాయా అనే ఆందోళనలు ఇన్వెస్టర్లను ప్రస్తుతం వెంటాడుతున్నాయి.

GDPకి మార్కెట్ క్యాప్ మెట్రిక్ అనేది సుదీర్ఘ కాల వ్యవధిలో గమనించాల్సిన అవసరం ఉందని ఇంటెల్సెన్స్ క్యాపిటల్ చీఫ్ ఈక్విటీ అడ్వైజర్ అభిషేక్ బసుమల్లిక్ అన్నారు. మరికొందరు నిపుణులు సైతం తాజా నిష్పత్తి పెరుగుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లు బాగా పనిచేస్తున్నాయని, దీనికి తోడు వరుసగా మార్కెట్లోకి వస్తున్న ఐపీవోలు లిస్టెడ్ మార్కెట్ క్యాప్‌ను పెంచడాన్ని కూడా పరిగణించాలని వారు అంటున్నారు. మెుత్తం మీద మార్కెట్లు దెబ్బతినవని అభిషేక్ అంచనా వేశారు.
పెరుగుతున్న కార్పొరేట్ లాభదాయకత ఇటీవలి సంవత్సరాల్లో నామమాత్రపు GDP వృద్ధిని అధిగమించి ఆదాయ వృద్ధికి దారితీసిందని బ్రోకరేజ్ నిర్మల్ బ్యాంగ్ సెక్యూరిటీస్ పేర్కొంది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్‌లతో పోలిస్తే దేశీయంగా రిస్క్-రివార్డ్ లార్జ్ క్యాప్‌లకు మరింత అనుకూలంగా ఉందని బ్రోకరేజ్ పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా అధిక లిక్విడిటీని బిగించడం ప్రధాన ప్రమాదాలని అన్నారు. దీనికి తోడు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, దేశీయ ఎన్నికలు మార్కెట్లకు ప్రమాదాలుగా ఉన్నాయన్నారు.
ఈ క్రమంలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్‌బిఐ లైఫ్, మారుతీ సుజుకి, అశోక్ లేలాండ్, జీఎస్‌పీఎల్, అంబుజా సిమెంట్స్, త్రివేణి టర్బైన్, బ్లూ స్టార్ వంటి స్టాక్‌లు 2024కి సంబంధించిన టాప్ స్టాక్ ఐడియాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications