నూనె ధరలు తగ్గుతాయా? దిగుమతులు పెరుగుతున్నాయి
నూనె ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. భారత్ పామాయిల్ దిగుమతులు ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో 21 శాతం పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పామాయిల్ దిగుమతులు ఆ దేశాల నుండి తగ్గాయి. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది ప్రభుత్వం. అదే సమయంలో దక్షిణ అమెరికాలో సోయాఆయిల్ పంట తగ్గింది. అదే సమయంలో ఉక్రెయిన్ సన్ ఫ్లవర్ ఆయిల్‌కు ప్రత్యామ్నాయంగా ఎడిబుల్ ఆయిల్‌పై ఆధారపడే భారత్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. భారత్‌లో డిమాండ్ పామాయిల్ ధరలు పెరగడానికి కూడా దోహదపడింది. మార్చి 9న టన్నుకు 7268 రింగ్గిట్స్ ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది. అయినప్పటికీ అది టన్నుకు 5741 రింగ్గింట్స్‌కు పడిపోయింది.
మార్చి నెలలో 5,55,000 టన్నుల పామాయిల్ భారత్‌కు దిగుమతి అయ్యాయి. ఫిబ్రవరి నెలలో ఈ దిగుమతులు 45,794 మాత్రమే. ఏప్రిల్ నెలలోను పామాయిల్ ధరలు దిగుమతులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయిల్ ఇంపోర్టర్స్ అభిప్రాయపడుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల నుండే మనకు 90 శాతం ఆయిల్ దిగుమతులు వస్తున్నాయి. మార్చి నెలలో భారత్ 2,10,000 టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. ఫిబ్రవరి నెలలో ఇది 1,52,220 టన్నులు మాత్రమే.

అదే సమయంలో ఉక్రెయిన్ నుండి క్రమంగా సన్ ఫ్లవర్ ఆయిల్ ఎగుమతులు పెరుగుతున్నాయి. రష్యా, అర్జెంటీనాల నుండి దిగుమతులు పెంచుకుంటున్నారు ఆయిల్ ఇంపోర్టర్స్. అయితే దిగుమతులకు సంబంధించి పరిమితులు ఉన్నాయని, మనం ఉక్రెయిన్ మినహా నెలకు 1,00,000 టన్నులు మాత్రమే దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని, డిమాండ్ మాత్రం 2,00,000 టన్నులుగా ఉందని చెబుతున్నారు. ఉక్రెయిన్ సరఫరా నిలిపివేయడం వల్ల స్థానిక మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరగడంతో ఏప్రిల్‌లో ఎగుమతుల కోసం రికార్డ్ స్థాయిలో అత్యధిక ధరకు 45,000 టన్నుల రష్యన్ సన్ ఫ్లవర్ ఆయిల్‌కు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.
సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం మార్చి నెలలో సోయాఆయిల్ దిగుమతులు ఫిబ్రవరితో పోలిస్తే 18 శాతం పెరిగి 3,10,000 టన్నులకు చేరుకుంది. భారత్ ఇండోనేషియా, మలేషియా నుండి అధిక పామాయిల్, అర్జెంటీనా, బ్రెజిల్ నుండి సోయా ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది.


Click it and Unblock the Notifications