దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో ఇటీవల చోటు చేసుకున్న మార్పులు సామాన్య ప్రజలతో పాటు ఆర్థిక వర్గాల్లోనూ తీవ్రమైన చర్చకు దారి తీస్తున్నాయి. భారతీయుల పెట్టుబడి అలవాట్లను పరిశీలిస్తే, స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ కంటే బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై ఎక్కువ నమ్మకం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నమ్మకంలో భాగంగానే భారతీయ గృహాల్లో ఉన్న బంగారం విలువ ఇప్పుడు ఎవరూ ఊహించని స్థాయికి చేరింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ బంగారం మొత్తం విలువ భారతదేశపు మొత్తం స్థూల దేశీయోత్పత్తి (GDP) కంటే కూడా ఎక్కువగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఇటీవల ట్రేడింగ్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,500 డాలర్లను దాటి 4,550 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఈ Gold ధరల పెరుగుదల భారతీయుల వద్ద ఉన్న బంగారం సంపద విలువను భారీగా పెంచింది. ప్రముఖ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం.. భారతీయ గృహాల్లో సుమారు 34,600 టన్నుల బంగారం నిల్వగా ఉంది. ప్రస్తుత అంతర్జాతీయ ధరలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ బంగారం మొత్తం విలువ 5 ట్రిలియన్ డాలర్లు దాటుతుంది. ఇది ప్రపంచంలో ఏ దేశానికీ లేని ప్రత్యేకమైన స్థితి అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) గణాంకాల ప్రకారం.. భారతదేశం మొత్తం GDP విలువ సుమారు 4.1 ట్రిలియన్ డాల్లరు మాత్రమే. అంటే, దేశ ప్రజల ఇళ్లలో ఉన్న బంగారం సంపద, దేశం ఒక ఏడాదిలో సృష్టించే మొత్తం ఆర్థిక ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇది భారతీయ సమాజంలో బంగారానికి ఉన్న సాంస్కృతిక, ఆర్థిక ప్రాధాన్యతను మరోసారి రుజువు చేస్తోంది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం.. ప్రపంచ బంగారు డిమాండ్‌లో భారతదేశం సుమారు 26 శాతం వాటా కలిగి ఉంది. ఈ జాబితాలో చైనా 28 శాతంతో అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో ఇప్పటికీ బంగారు ఆభరణాలే ప్రధాన వినియోగ రూపంగా ఉన్నప్పటికీ.. ఇటీవలి కాలంలో బంగారు కడ్డీలు (bars), నాణేలు (coins) వంటి పెట్టుబడి రూపాల్లో డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఇది ప్రజలు బంగారాన్ని కేవలం అలంకరణకు కాకుండా, భద్రమైన పెట్టుబడి సాధనంగా కూడా చూస్తున్నారనే విషయాన్ని సూచిస్తుంది.
బంగారం ప్రాధాన్యత ప్రభుత్వ స్థాయిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా తన విదేశీ మారక నిల్వలను బలోపేతం చేయడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. 2024 నుండి ఇప్పటివరకు RBI దాదాపు 75 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో దేశంలోని కేంద్ర బ్యాంక్ వద్ద మొత్తం బంగారు నిల్వలు సుమారు 880 టన్నులకు చేరాయి. మోర్గాన్ స్టాన్లీ ప్రకారం, ఇది భారతదేశ మొత్తం విదేశీ మారక నిల్వల్లో దాదాపు 14 శాతం వాటాను సూచిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే బంగారం భారతీయ ఆర్థిక వ్యవస్థలో కేవలం లోహం మాత్రమే కాదు, అది భద్రత, సంపద, విశ్వాసానికి ప్రతీకగా మారింది.
More From GoodReturns

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications