డిగ్రీలు చేతిలో.. ఉద్యోగాలు ఎక్కడ.. భారత్‌కు పొంచి ఉన్న ఆర్థిక ముప్పు గురించి ఎవరికైనా తెలుసా..

India's Hidden Economic Challenge: భారతదేశంలో నిశ్శబ్దంగా దాగివున్న ఆర్థిక టైమ్ బాంబ్ గురించి ఎవరికైనా తెలుసా.. 367 మిలియన్ల యువత ఉపాధి సంక్షోభం 2050 వృద్ధికి ఎందుకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోంది. భారతదేశంలో ఎప్పుడెప్పుడా విరుచుకుపడదామా అని ఎదురుచూస్తున్న ఈ అదృశ్య సమస్య 2050లో భూకంపంలా విస్ఫోటనం చెందుతుందా? ఉపాధి లేక విలవిలలాడే పరిస్థితులు కనిపిస్తున్నాయా.. చదివిన చదువులకు జాబులు దొరికే పరిస్థితి లేదా..ఇప్పుడు ఈ ప్రశ్నలు యువతరాన్నితీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ప్రపంచంలోనే అత్యధిక యువ శ్రామిక శక్తి కలిగిన దేశంగా భారత్ సాధిస్తున్న ప్రగతిపై, 2045, 2050ల నాటి "వికసిత్ భారత్" రూపకల్పనపై నిరంతరం విస్తృత చర్చలు జరుగుతున్నాయి. కానీ అంతకంటే ముందే దేశం.. ఆర్థిక భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేసే అత్యంత సవాలుతో కూడిన 'ఉపాధి సంక్షోభం' ఎదుర్కొంటోంది. ఐక్యరాజ్యసమితి (UN) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ప్రస్తుతం భారతదేశంలో 15 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు ఏకంగా 36.7 కోట్లకు పైగా ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో సుమారు 28 శాతానికి సమానం. అయితే ఈ యువతకు సరైన స్థాయి నిరుద్యోగిత నివారణ, తగిన ఉపాధి లభిస్తున్నాయా అంటే ప్రతికూల సమాధానమే వినబడుతోంది.

India Youth Unemployment 367 Million Youth Youth Employability Crisis India Jobs Crisis Graduate Unemployment Demographic Dividend India Skill Gap Indian Economy Job Creation Youth Employment News India youth unemployment 367 million youth youth employability crisis India jobs crisis graduate unemployment India demographic dividend India labour market 36 7

దేశీయంగా ప్రతి ఏటా కనీసం 1 కోటి కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సిన అత్యవసర పరిస్థితి ఉంది. ప్రస్తుతం 22 నుండి 25 ఏళ్ల వయస్సులో ఉన్న యువత రాబోయే 6 నుండి 7 ఏళ్లలో 30 ఏళ్ల మైలురాయిని దాటనున్నారు. జీవితంలో ఎంతో కీలకమైన ఈ వ్యవధిలో యువతకు సరైన ఉద్యోగం, తగిన ఆదాయం, నైపుణ్యం, అనుభవం లభించకపోతే, అది కేవలం వ్యక్తిగత కుటుంబాలపైనే కాక.. దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగం, ఇళ్ల కొనుగోళ్లు, వివాహాలు, సామాజిక భద్రతను కుప్పకూల్చే ప్రమాదముంది. ఈ తీవ్ర అనిశ్చితి కారణం ప్రైవేట్ రంగం ఎంత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఏడాదికి కోటి మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేకపోవడమే. ఫలితంగా భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలపై ఉపాధి ఆశలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పోటీ పరీక్షల గణాంకాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Also Read

ఉదాహరణకు, కేవలం 15,118 పోస్టుల కోసం నిర్వహించిన SSC CGL పరీక్షకు ఏకంగా 28 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఆర్ఆర్‌బీ (RRB) పరీక్షలకు గత మూడున్నరేళ్లలో సుమారు 4 కోట్ల మంది హాజరయ్యారు. స్థిరమైన ఆదాయం, ఉద్యోగ భద్రత, సామాజిక హోదా కోసం యువత తమ విలువైన 22 ఏళ్ల నుండి 30 ఏళ్ల వయస్సు వరకు ఏళ్ల తరబడి శిక్షణ పొందుతూ పరీక్షలు రాస్తున్నారు. అయితే నోటిఫికేషన్లు, ఉద్యోగాల సంఖ్య పరిమితంగా ఉండటంతో 30 ఏళ్లు వచ్చిన తర్వాత తిరిగి వేరే రంగంలో ఉద్యోగాన్వేషణ చేయడం, నైపుణ్య లోపం వల్ల పరిశ్రమల్లో తగిన అవకాశాలు పొందలేకపోవడం భారత్‌ను తీవ్ర ముప్పులోకి నెడుతోంది.

సరిగ్గా ఇదే సమయంలో సర్వీస్ రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత విప్లవాత్మకంగా మారుస్తూ, అనేక సంప్రదాయ ఉద్యోగాలను ఆటోమేషన్ ద్వారా భర్తీ చేస్తోంది. మరోవైపు, పెద్ద ఎత్తున కార్మికులను శోషించుకునే సామర్థ్యం ఉన్న భారత ఉత్పాదక రంగం (Manufacturing Sector) స్థూల విలువ జోడింపు గత రెండు దశాబ్దాలుగా కేవలం 16-18 శాతం వద్దే నిలిచిపోవడం నిరాశ కలిగిస్తోంది.

ఈ ఉపాధి గండం నుండి భారత్ బయటపడాలంటే కేవలం ఉచిత పథకాలు లేదా తాత్కాలిక నియామకాలు పరిష్కారం కావు. దీనికి ఉద్యోగాలు, నైపుణ్యాలు, ఉత్పత్తి, పెట్టుబడి, ఎగుమతుల సమన్వయంతో కూడిన పంచసూత్ర వ్యూహం అత్యవసరం. మేక్ ఇన్ ఇండియా మరియు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాలను ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, టెక్స్‌టైల్స్ రంగాలలో మరింత విస్తరించి ఉత్పాదక రంగ వాటాను కనీసం 25 శాతానికి పెంచాల్సి ఉంది. పోటీ పరీక్షల వైఫల్యం తర్వాత యువత నిరాశ చెందకుండా ఏఐ, రోబోటిక్స్, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ తయారీ రంగాల్లో ఉచిత ప్రాక్టికల్ నైపుణ్య శిక్షణను విశ్వవిద్యాలయ స్థాయి నుంచే అందించాలి.

అలాగే భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) రుణ ప్రాప్తిని పెంచి, స్థానిక ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా కోట్ల సంఖ్యలో గ్రామీణ, పట్టణ ప్రాంత ఉద్యోగాలను సృష్టించవచ్చు. చైనా నుంచి బయటకు వస్తున్న అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తూ, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) ప్రోత్సహించడం కూడా సమానమైన ప్రాధాన్యత కలిగిన అంశం. తాత్కాలిక భద్రతనిచ్చే పోటీ పరీక్షల వెంటే నడవకుండా, యువతను గ్లోబల్ నైపుణ్యాలతో తీర్చిదిద్ది ఉత్పాదక విప్లవంలో భాగస్వాములను చేసినప్పుడే భారత్ తన జనాభా ప్రయోజనాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోగలదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+