న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక హీరో మోటార్స్ కంపెనీ.. తాను రూపొందించిన హీరో సైకిల్స్ ఇ-బైక్స్‌ను యూరప్ మార్కెట్‌లోకి విజయవంతంగా విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న మేడిన్ ఇండియా కాన్సెప్ట్‌లో భాగంగా తొలి బ్యాచ్ ఇ-బైక్స్ హీరో సైకిళ్లను యూరప్‌లో మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకుని వచ్చింది. తొలివిడతలో భాగంగా జర్మనీకి 200 ఇ-బైక్స్ యూనిట్లను పంపించినట్లు హీరో మోటార్స్ కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. 2025 నాటికి 300 మిలియన్ల యూరోల మేర హీరో సైకిల్స్ ఇ-బైక్స్ మార్కెట్‌ను విస్తరించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపింది.
భారత్‌లో తయారైన హీరో ఇ-బైక్స్ షిప్‌మెంట్ విజయవంతమైందని, తాము పంపించిన యూనిట్లు జర్మనీకి చేరుకున్నాయని హీరో ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్ వీజ్ అన్నారు. యూరప్‌లో 2030 నాటికి ఇ-బైక్స్ మార్కెట్ రెట్టింపు కాబోతోందని, భవిష్యత్ అవసరాలు, డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని 15 మిలియన్ల యూనిట్ల మేర ఇ-బైక్స్‌ను యూరప్ మార్కెట్‌లో విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం భారత్‌లో బైక్ మార్కెట్ 0.8 బిలియన్ల వరకు ఉంటోందని, ఇందులో ప్రతి సంవత్సరం 15 మిలియన్ల వరకు సైకిళ్ల అమ్మకాలు నమోదవుతున్నాయని అన్నారు. యూరోపియన్ మార్కెట్ మాత్రం దీనికి 15 రెట్లు ఉంటోందని హెచ్ఎంసీ గ్రూప్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ ఎం ముంజల్ తెలిపారు. క్రమంగా ఈ మార్కెట్ అయిదు బిలియన్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నామని అన్నారు. దీనికోసం పంజాబ్‌లోని లూధియానాలో గల వంద ఎకరాల్లో ఉన్న సైకిల్ తయారీ యూనిట్‌ను విస్తరించాలనే ప్రతిపాదనలను ఉన్నట్లు చెప్పారు.
యూరప్ వాతావరణం, రోడ్ల స్థితిగతులు, మార్కెట్‌లో నెలకొన్న పోటీ.. వంటి పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నామని, తొలి విడత బ్యాచ్‌కు అనువైన దేశంగా భావించి జర్మనీలో విడుదల చేసినట్లు వీజ్ స్పష్టం చేశారు. డిమాండ్‌కు అనుగుణంగా భారత్‌లో సైకిళ్లు, ఇ-బైక్స్‌ను ఉత్పత్తి పెంచుతామని పేర్కొన్నారు. లూధియానాతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, బిహార్‌లోని బిహ్తతో పాటు శ్రీలంకలో హీరో మోటార్ కార్పొరేషన్‌కు సైకిళ్ల తయారీ యూనిట్లు ఉన్నాయి. సైకిళ్ల డిజైన్ యూనిట్ బ్రిటన్‌లో కొనసాగుతోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications