భారతదేశంలో బంగారం అంటే పెట్టుబడిగా మాత్రమే కాదు.. ఓ అలంకారంగా కూడా చూస్తారు.. ఆభరణాలను కొనుగోలు చేయడం ద్వారా ఇండియన్లు సంస్కృతిలో భాగమవుతారు.అయితే ధరల పెరుగుదల భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచ బంగారు మండలి (World Gold Council - WGC) తాజా నివేదికను చూసుకున్నట్లయితే ఈ విషయాలు తెలుస్తాయి. ఈ నివేదిక ప్రకారం..2025లో భారతదేశ బంగారం వినియోగం ఐదేళ్ల కనిష్టానికి పడిపోతుందని తెలిపింది.
2025 ఏడాది చివరి నాటికి పసిడి వినియోగం ఐదేళ్ల కనిష్టానికి పడిపోవడం పట్ల మార్కెట్ నిపుణులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ ఏడాది దేశంలో బంగారం వినియోగం దాదాపు 600 నుండి 700 మెట్రిక్ టన్నుల మధ్య మాత్రమే ఉంటుందని ప్రపంచ బంగారు మండలి అంచనా వేసింది. ఇది 2020 తర్వాత అత్యల్ప స్థాయిగా చెప్పుకోవచ్చు. ఈ తగ్గుదల వెనుక ప్రధాన కారణాన్ని చూసుకున్నట్లయితే..రికార్డు స్థాయిలో పెరిగిన ధరలే కారణంగా చెప్పుకోవాలి. 2025లో ఇప్పటివరకు బంగారం ధరలు దాదాపు 28 శాతం వరకు పెరుగుదలను చూశాయి. జూన్ నెలలో 10 గ్రాముల ధర ఏకంగా లక్ష రూపాయల మార్కును దాటి రూ. 1,01,078 వద్ద పెరుగుదల నమోదు చేసింది.

ఈ పెరుగుదలతో బంగారం ప్రియులు పసిడిని కొనడం తగ్గించుకున్నారు. దీంతో బంగారం కొనుగోలుపై ఇది నెగిటివ్ ప్రభావం చూపింది.ముఖ్యంగా అభరణాల విషయంలో ఇది స్పష్టంగా కనిపించింది. WGC భారత విభాగం CEO సచిన్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. బంగారం ధరలు స్థిరంగా ఉంటే.. భారత్ లో పసిడి వినియోగం 700 టన్నుల వరకు ఉండవచ్చని అంచనా.. అయితే భౌగోళిక రాజకీయ పరిస్థితులతో ధరలు పెరిగితే మాత్రం వినియోగం 600 టన్నులకే పరిమితం కావచ్చని తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో చూసుకున్నట్లయితే.. ఇండియాలో బంగారం వినియోగం 134.9 టన్నులు మాత్రమే నమోదైంది. ఇది గత ఏడాది 2024తో పోల్చితే 10 శాతం తగ్గుదలగా చెప్పుకోవచ్చు ఇందులో ఆభరణాల డిమాండ్ 17 శాతం తగ్గగా.. పెట్టుబడుల డిమాండ్ మాత్రం 7 శాతం పెరిగింది. ఇన్ని రకాల పరిస్థితులు ఉన్నప్పటికీ బంగారం ఇతర ఆస్తుల కంటే సురక్షితమైనదిగా పరిగణించబడుతోంది.
ప్రధానంగా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ETFs) పట్ల పెట్టుబడిదారుల ఆసక్తి బాగా పెరిగింది. జూన్ నెలలో గోల్డ్ ETFs పెట్టుబడులు 20.81 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది గత ఐదు నెలల్లో గరిష్ట స్థాయిగా చెప్పుకోవచ్చు.భారతీయ మార్కెట్‌లో ఇప్పుడు గోల్డ్ ETFs మీద ఆసక్తి విపరీతంగా పెరిగిపోతోందని WGC తెలిపింది. ఇండియా డిజిటలైజేషన్ దిశగా పరుగులు పెట్టడంతో గోల్డ్ ETFs పెట్టుబడిదారులకుఅందుబాటులోకి వస్తున్నాయని సచిన్ జైన్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించడంతో బంగారం మీద కొనుగోళ్లు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో అధిక ధరలు ప్రజలను బంగారం వైపు మళ్లించడం లేదని కూడా పలు నివేదికలు చెబుతున్నాయి. ఏదేమైనా బంగారం పెట్టుబడిదారులకు ఆకర్షణగా మారినప్పటికీ ఆభరణాల కొనుగోలు దారులకు మాత్రం నిరాశనే మిగుల్చుతోంది. ధరలు సాధారణ స్థాయికి రాకపోతే ఆభరణాల డిమాండ్ భారీగా తగ్గే అవకాశం ఉందని World Gold Council - WGC అంచనా వేసింది.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications