కరోనా మహమ్మారి కారణంగా 2020+21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ 23.9 శాతం మేర కుంచించుకుపోయింది. ఆర్థిక సరళీకరణ తర్వాత, అలాగే క్వార్టర్ జీడీపీ లెక్కలు ప్రారంభమైన తర్వాత అత్యంత దారుణంగా పతనం కావడం ఇదే మొదటిసారి. కరోనా కారణంగా ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావించిన కేంద్రం సుదీర్ఘ లాక్ డౌన్ విధించింది. ఈ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనమైంది.

అమెరికా తర్వాత భారత్
కరోనా కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏకంగా మైనస్ 32.9 శాతం కుంచించుకుపోయింది. ఆ తర్వాత అత్యంత దారుణ పతనం భారత్‌దే. జీడీపీ దారుణంగా పడిపోయిన దేశాల్లో అమెరికా తర్వాత మైనస్ 23.9 శాతంతో మన దేశం ఉంది. పెద్ద ఆర్థిక వ్యవస్థల విషయానికి వస్తే మైనస్ 20.9 శాతంతో బ్రిటన్ మూడో స్థానంలో, మైనస్ 13.8 శాతంతో ఫ్రాన్స్ నాలుగో స్థానంలో, మైనస్ 12.4 శాతంతో ఇటలీ ఐదో స్థానంలో, మైనస్ 12 శాతంతో కెనడా ఆరో స్థానంలో, మైనస్ 10.1 శాతంతో జర్మనీ ఏడో స్థానంలో, మైనస్ 7.6 శాతంతో జపాన్ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. కరోనా పుట్టిన చైనా 3.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ దేశాల్లో భారత్, చైనా మినహా మిగతావి జీ7 కంట్రీస్.

చైనాలో ఆ క్వార్టర్‌లో భారీ పతనం
చైనాలో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న జనవరి-మార్చి క్వార్టర్‌లో జీడీపీ 6.8 శాతం మేర క్షీణతను నమోదు చేసింది. అదే క్వార్టర్‌లో భారత్ వృద్ధి రేటు 3.1 శాతంగా నమోదయింది. కరోనా వల్ల ఎక్కువగా ప్రభావితమైన జర్మనీ 10.1 శాతం మేర ప్రతికూలతను నమోదు చేసింది. ప్రపంచ కీలక లేదా పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా తర్వాత భారత్ దారుణంగా దెబ్బతిన్నాయి.

వ్యవసాయం మినహా..
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కేవలం వ్యవసాయం, ఫారెస్ట్రీ, ఫిషింగ్ మాత్రమే 3.4 శాతం మేర వృద్ధిని నమోదు చేశాయి. నిర్మాణ రంగం మైనస్ 50.30 శాతం, ట్రేడ్, హోటల్, ట్రాన్సుపోర్ట్ మైనస్ 47 శాతం, మ్యానుఫ్యాక్చరింగా మైనస్ 39.30 శాతం, మైనింగ్ అండ్ క్వారియింగ్ మైనస్ 23.30 శాతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్మైనస్ 10.30 శాతం, ఎలక్ట్రిసిటీ, యుటిలిటీస్ సర్వీసెస్ మైనస్ 7 శాతం మేర క్షీణించాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications