2020-21 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండొచ్చు: ఎకనమిక్ సర్వే అంచనా
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు ఉభయ సభల్లో ఆర్థిక సర్వేను (ఎకనమిక్ సర్వే) సమర్పిస్తారు. భారత ఆర్థిక వృద్ధి రేటు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి (2020-21) గాను 6 శాతం నుంచి 6.5 శాతం వరకు ఉండవచ్చునని ఎకనమిక్ సర్వే అంచనా వేస్తోంది. భారత్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో దారుణమైన వృద్ది రేటును నమోదు చేసిన విషయం తెలిసిందే. జూలై - సెప్టెంబర్‌లో 4.5 శాతం నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం అంచా 5 శాతంగా ఉంది. వచ్చే ఏడాది 6.5 శాతం వరకు ఉంటుందని ఎకనమిక్ సర్వే అంచనా వేసింది.
బడ్జెట్ సమావేశాలు నేటి (జనవరి 31) నుంచి ప్రారంభమై జనవరి 3 వరకు కొనసాగుతాయి. బడ్జెట్‌కు ముందు.. ఈ రోజు ఆర్థిక సర్వేను సమర్పిస్తారు. 15వ ఆర్థిక సంఘం తాత్కాలికంగా నివేదికు కూడా ఈ సమావేశాల్లో సభ ముందు ఉంచవచ్చు. ఏప్రిల్ 1, 2020 నుంచి ఈ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలులోకి రావాల్సి ఉండగా, కాలపరిమితిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే ఇచ్చి తాత్కాలిక నివేదికను సభ ముందు ఉంచి ఆమోదం తీసుకోనుంది. ఆర్థిక సంఘం నివేదికతో పాటు ఆర్థిక సర్వేను (ఎనకమిక్ సర్వే) ప్రవేశ పెడుతారు.

బడ్జెట్‌కు ఒక రోజు ముందు వెల్లడయ్యే ఆర్థిక సర్వేకు ఎంతో ప్రాధాన్యత. గడిచిన ఏడాది కాలానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితిని వెల్లడిస్తుంది. సవాళ్లు, పరిష్కారాలకు సంబంధించిన నివేదిక ఇది. వ్యవస్థలోని వివిధ రంగాల పరిస్థితిని ఇది తెలుపుతుంది. దీని ద్వారా మొత్తం ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో వెల్లడవుతుంది. అలాగే, ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలు పట్టేందుకు చేయాల్సిన విధాన మార్పులతో పాటు ప్రభుత్వం ఏం చేయాలో సూచిస్తుంది.


Click it and Unblock the Notifications