భారత ఆర్థిక వ్యవస్థ 2025లో ఒక కీలక మలుపు దిశగా పయనిస్తోందని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్న సమయంలో, సరఫరా గొలుసుల మార్పులు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, వాతావరణ మార్పుల ప్రభావం, టెక్నాలజీ విప్లవాలు దేశాల అభివృద్ధి దిశ దశను మార్చుతున్నాయి. ఇటువంటి సందర్భంలో.. భారత్ తన ఆర్థిక శక్తిని బలోపేతం చేసుకుంటూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే దిశగా ముందుకు సాగుతోంది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం ఇప్పుడు కేవలం భారతదేశం ఆలోచన కాదు. సూక్ష్మ వ్యూహాలతో ముందుకు సాగుతున్న ఒక వాస్తవ ప్రయాణంగా మనం చెప్పుకోవచ్చు.
దీనికి తోడ్పడిన అంశాలను మనం చూసినట్లయితే ప్రధానంగా డిజిటల్ రంగం భారత వృద్ధికి కొత్త ఊపును తెచ్చింది. UPI ఆధారిత చెల్లింపులు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, AI ఆధారిత సేవలు, 5G, రాబోయే 6G సాంకేతికతలు దేశ ఆర్థిక నిర్మాణాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ప్రపంచ దేశాలు అధ్యయనం చేసేలా డిజిటల్ మోడల్‌గా భారత్ నిలుస్తోంది. ప్రజాసేవలు వేగవంతమవుతున్నాయి. పారదర్శకత పెరుగుతోంది. అలాగే వ్యాపారాలు నిర్వహించడం సులభమవుతోంది.

తయారీ రంగంలో మేక్ ఇన్ ఇండియా.. PLI ప్రోత్సాహకాలతో దేశీయ ఉత్పత్తి వేగంగా పెరుగుతోంది. ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఆటోమొబైల్, సెమీకండక్టర్, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు వరదలా ప్రవహిస్తున్నాయి. ఇంతకుముందు దిగుమతులపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో ఎగుమతి కేంద్రంగా ఎదుగుతోంది. ఈ మార్పు కేవలం ఆర్థిక లాభాలకే కాకుండా, లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తోంది.
మరో ప్రధాన అంశం ఏంటంటే.. మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ ముఖచిత్రాన్ని మార్చుతోంది. గతి శక్తి ప్రణాళిక, స్మార్ట్ సిటీస్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్, హై-స్పీడ్ రైలు వంటి భారీ ప్రాజెక్టులు దేశ రవాణా శక్తిని పెంచుతూ, వ్యాపార వేగాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ప్రపంచ పెట్టుబడిదారులు భారత మార్కెట్‌ను భవిష్యత్ వృద్ధి కేంద్రంగా చూస్తున్నారు. వాతావరణ సంక్షోభం నేపథ్యంలో గ్రీన్ శక్తి రంగం భారత ఆర్థిక వ్యవస్థను కొత్త దిశలోకి తీసుకువెళుతోంది. సౌర, గాలి, హరిత హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి రంగాల్లో భారత్ వేగంగా ముందుకు సాగుతోంది. ఇది విదేశీ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గిస్తూ, వాణిజ్య లోటును సమతుల్యం చేసే మార్గాన్ని సృష్టిస్తోంది.
అయితే అవకాశాలతో పాటు అనేక ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల, ఉద్యోగ అవకాశాల అసమానత, నైపుణ్యం లోటు, గ్లోబల్ ట్రేడ్ ఉద్రిక్తతలు, ఇంధన ధరల మార్పులు దేశ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక లోటును నియంత్రించడం అత్యంత ముఖ్యమైన పనిగా మారింది. ట్రేడ్ వార్స్ & జియోపాలిటిక్స్ కారణంగా అనేక దేశాలు ఆర్థిక భద్రత కోసం కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నాయి. ఈ పోటీ వాతావరణంలో భారత్ బలంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అయితే సవాళ్లకంటే అవకాశాలు పెద్దవి. బలమైన నాయకత్వం, శక్తివంతమైన యువ జనాభా, సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసం భారత ప్రయాణానికి బలమైన అవకాశాలుగా నిలుస్తున్నాయి. 2025లో భారత్ తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు రాబోయే దశాబ్దపు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. సరైన అమలు, సమగ్ర సంస్కరణలు, సమయోచిత వ్యూహాలతో కొనసాగితే, భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ప్రధాన ఆర్థిక శక్తిగా నిలబడటమే కాకుండా.. 5 ట్రిలియన్ డాలర్ల Economy లక్ష్యాన్ని సాధించడం పెద్ద కష్టమేమి కాదని చెప్పవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications