Budget 2026: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2026 పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే పలు రంగాలు ఈ సారి బడ్జెట్లో కేంద్రం ఏదైనా రిలీఫ్ ఇస్తుందనే ఆశలు పెట్టుకున్నాయి. తాజాగా భారతదేశంలోని క్రిప్టో, వెబ్3 పరిశ్రమ కూడా భారీగానే ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వం నుంచి కీలక పన్ను, నియంత్రణ సంస్కరణలపై ఈ సారి ఏమైనా ఊరట వస్తుందోమోనని ఎదురుచూస్తోంది. దేశీయ క్రిప్టో కార్యకలాపాలను పునరుద్ధరించడం, పారదర్శకతను పెంపొందించడం, వర్చువల్ డిజిటల్ ఆస్తులు (VDAలు) రంగంలో దీర్ఘకాలిక ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పరిశ్రమ పన్ను విధానాల పునఃసమీక్షను ఈ రంగం కోరుతోంది.
2022లో క్రిప్టో ఆస్తులపై పన్ను విధించడం ద్వారా ఈ రంగానికి అధికారిక గుర్తింపు లభించినప్పటికీ.. అధిక పన్నులు మార్కెట్ వృద్ధికి అడ్డుగా మారాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా క్రిప్టో లాభాలపై విధించిన 30 శాతం పన్ను, ప్రతి లావాదేవీపై 1 శాతం TDS కారణంగా దేశీయ ట్రేడింగ్ వాల్యూమ్స్ గణనీయంగా తగ్గాయని, చాలా మంది పెట్టుబడిదారులు విదేశీ (ఆఫ్‌షోర్) ప్లాట్‌ఫారమ్‌ల వైపు మళ్లుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

బైబిట్ ఇండియా కంట్రీ మేనేజర్ వికాస్ గుప్తా మాట్లాడుతూ.. 30 శాతం పన్ను విధానం పర్యవేక్షణ, సమ్మతిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించిందని అంగీకరించారు. అయితే, అధిక పన్ను భారం కారణంగా భారతీయ ప్లాట్‌ఫారమ్‌లు తమ మార్కెట్ వాటాను కోల్పోతున్నాయని, తక్కువ ఖర్చుతో ట్రేడింగ్ అందించే విదేశీ ఎక్స్ఛేంజ్‌లకు వినియోగదారులు తరలిపోతున్నారని తెలిపారు. బడ్జెట్ 2026ను డిజిటల్-ఫస్ట్ ఎకానమీగా భారత్‌ను బలోపేతం చేసే అవకాశంగా ఆయన అభివర్ణించారు. 30 శాతం పన్ను రేటును సమీక్షిస్తే.. పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుందని, దేశీయ ప్లాట్‌ఫారమ్‌లపై నమ్మకం బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
క్రిప్టో లావాదేవీలపై విధిస్తున్న 1శాతం TDS మరో పెద్ద సమస్యగా మారిందని పరిశ్రమ చెబుతోంది. ఈ నిబంధన వల్ల లిక్విడిటీ దెబ్బతింటోందని, ట్రేడింగ్ సామర్థ్యం తగ్గుతోందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముడ్రెక్స్ సీఈఓ ఎడుల్ పటేల్ మాట్లాడుతూ.. భారతీయ క్రిప్టో పెట్టుబడిదారులు ఇప్పుడు మరింత పరిపక్వంగా మారారని, హైప్ ఆధారిత ట్రేడింగ్ కంటే దీర్ఘకాలిక విలువపై దృష్టి పెడుతున్నారని తెలిపారు. అయితే, అధిక TDS కారణంగా ఆఫ్‌షోర్ ట్రేడింగ్ పెరుగుతోందని, దీనివల్ల దేశీయ వ్యవస్థలో పారదర్శకత తగ్గుతోందని ఆయన హెచ్చరించారు.
TDSను 0.1 శాతానికి తగ్గించడంతో పాటు, లాభాలపై నష్టాలను సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కల్పించాలని పటేల్ సూచించారు. ఇది పెట్టుబడిదారులపై భారం తగ్గించి, మెరుగైన పోర్ట్‌ఫోలియో నిర్వహణకు దోహదం చేస్తుందని ఆయన అన్నారు.
CoinDCX సహ వ్యవస్థాపకుడు సుమిత్ గుప్తా కూడా పన్ను వ్యవస్థలో ఆచరణాత్మక సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత క్రిప్టో పన్ను చట్రం నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో, దీనిని ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. అన్ని ఎక్స్ఛేంజ్‌లలో TDSను ఏకరీతిగా అమలు చేయడం సమ్మతిని మెరుగుపరుస్తుందని, వినియోగదారులను అనధికార ప్లాట్‌ఫారమ్‌ల నుంచి రక్షిస్తుందని తెలిపారు.
TDSను 0.01 శాతం వరకు తగ్గిస్తే ఆఫ్‌షోర్ వలసలకు ప్రధాన కారణం తొలగిపోతుందని, పర్యవేక్షణ కూడా కొనసాగుతుందని గుప్తా పేర్కొన్నారు. అంతేకాదు, 30శాతం మూలధన లాభాల పన్నును ఆదాయపు పన్ను స్లాబ్‌లకు అనుసంధానం చేయడం, నష్టాల సర్దుబాటు, Web3 స్టార్టప్‌లకు ప్రామాణిక వ్యాపార తగ్గింపులు వంటి సూచనలను ఆయన ప్రస్తావించారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications