Gautam Adani: ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి అదానీ.. ఆసియా నుంచి తొలి వ్యక్తిగా రికార్డు..

Gautam Adani: రోజుకో సంచలనాన్ని సృష్టిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త అదానీ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈ సారి మరో రికార్డు ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటి వరకు ఆసియాలో ఏ కుబేరుడు సాధించని దానిని ఆయన నిజయం చేసి చూపారు. తాజా రికార్డులతో ఆయన పేరు మరో సారి సంచలనంగా మారింది.

అదానీ ఒక్క అడుగు..

ఇంతకీ విషయం ఏమిటంటే.. ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న ఆయన తాజాగా మరో మెట్టు పైకెక్కారు. మూడవ స్థానంలో ఉన్న లూయిస్ విట్టన్ సహ వ్యవస్థాపకుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ ను వెనక్కు నెట్టారు. ఆసియా నుంచి ఇలాంటి ఘనత సాధించిన తొలి వ్యక్తిగా నిలిచి ప్రపంచ వ్యాప్తంగా చర్యకు కారణమయ్యారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ తాజా డేటా ప్రకారం ప్రస్తుతం అదానీ సంపద 137 బిలియన్ డాలర్లుగా ఉంది. తొలి రెండు స్థానాల్లో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్‌లు కొనసాగుతున్నారు.

బిలియనీర్ల సంపద..

బిలియనీర్ల సంపద..

టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ నికర విలువ 251 బిలియన్ డాలర్లుగా ఉండగా, అమెజాన్ వ్యవస్థాపకుడు, CEO జెఫ్ బెజోస్ సంపద 153 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే తాజాగా అదానీ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి రికార్డులను బద్దలకొట్టారు. ప్రపంచంలోని మొదటి ముగ్గురు సంపన్న వ్యక్తుల జాబితాలో ఒక ఆసియా వ్యక్తి చోటు సంపాదించడం ఇదే తొలిసారని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. అయితే ఆసియాలోని భారతీయ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, చైనా వ్యాపారవేత్త అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా వంటి వారు కూడా ఈ స్థానానికి చేరుకోలేకపోయారు.

అదానీ గ్రూప్‌..

అదానీ గ్రూప్‌..

దేశంలో అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ అయిన అదానీ గ్రూప్‌కు గౌతమ్ అదానీ సహ వ్యవస్థాపకుడు. ఈ గ్రూపు దేశంలోనే అతిపెద్ద బొగ్గు వ్యాపారిగా గుర్తింపు పొందింది. మార్చి 31 2021 వరకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా 5.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నివేదించింది. అయితే గత వారం దేశంలోని ప్రముఖ మీడియా.. NDTVలో అదానీ సంస్థలు 29 శాతం వాటాల కొనుగోలు ఏకపక్షంగా జరిగిందనే దానిపై వివాదం కొనసాగుతోంది. ఈ డీల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదానికి లోబడి ఉంటుందని ఎన్‌డిటివి తెలిపింది. ప్రస్తుతం విషయం సెబీ వద్దకు చేరుకుంది.

అదానీ ఎందుకు మూడోస్థానానికి వచ్చారంటే.. ?

అదానీ ఎందుకు మూడోస్థానానికి వచ్చారంటే.. ?

ప్రపంచ వ్యాప్తంగా కొందరు వ్యాపారవేత్తలు, కుబేరులు తమ సంపదలో దాతృత్వ కార్యకలాపాలకు ఎక్కువ వెచ్చించటం కూడా అదానీకి కలిసొచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, ఫిచ్ గ్రూప్ యూనిట్ క్రెడిట్‌సైట్స్ ఇటీవల అదానీ గ్రూప్ తీవ్ర ఎక్కువ లెవరేజింగ్ వినియోగించుకుంటోందని, ఈ కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోవచ్చిని పేర్కొంది.

బిలియనీర్ల ఛారిటీ..

బిలియనీర్ల ఛారిటీ..

జులైలో గేట్స్ బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు 20 బిలియన్ డాలర్లను దాతృత్వానికి వినియోగించనున్నట్లు ప్రకటించింది. అయితే వారెన్ బఫ్ఫెట్ ఇప్పటికే 35 బిలియన్ డాలర్లకుపైగా దాతృత్వానికి విరాళంగా ఇచ్చారు. అదానీ జూన్‌లో సామాజిక ప్రయోజనాల కోసం 7.7 బిలియన్ డాలర్లను ఛారిటీకి అందిచనున్నట్లు తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+