అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొన్న వేళ భారత్ వాణిజ్యానికి శుభవార్త అందింది. 2025 ఆగస్టులో భారతదేశం వాణిజ్య రంగంలో అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈ నెలలో దేశం మొత్తం 69.16 బిలియన్ల డాలర్ల ఎగుమతులు సాధించింది, ఇది గత సంవత్సరం ఆగస్టులోని 63.25 బిలియన్ల డాలర్లతో పోల్చుకుంటే 9.34 శాతం పెరుగుదల. ముఖ్యంగా వస్తువుల exports 32.89 బిలియన్ల డాలర్ల నుండి 35.10 బిలియన్ల డాలర్లకు పెరిగాయి. అలాగే సేవల ఎగుమతులు కూడా 30.36 బిలియన్ల డాలర్ల నుంచి 34.06 బిలియన్ల డాలర్ల వరకు చేరుకున్నాయి. ఈ రెండు రంగాలలోను ఉత్సాహకరమైన పెరుగుదల చోటు చేసుకుంది.
అంతేకాకుండా, దిగుమతులు తగ్గడం కూడా మంచి సంకేతంగా భావించవచ్చు. ఆగస్టులో దేశానికి వచ్చిన వస్తువులు, సేవల మొత్తం 79.04 బిలియన్ల డాలర్లుగా ఉండగా, గత సంవత్సరం అదే నెలలో ఇది *84.99 బిలియన్ల డాలర్లు ఉండేది. వాణిజ్య లోటు కూడా గణనీయంగా తగ్గి 9.88 బిలియన్ల డాలర్ల వద్ద నిలిచింది, గత సంవత్సరం ఇది 21.73 బిలియన్ల డాలర్లగా ఉంది. అంటే ఇప్పుడు మన దేశం ఎక్కువగా ఎగుమతులు చేసి తక్కువగా దిగుమతులు చేసుకోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో మన పరిస్థితి మరింత మెరుగ్గా మారుతోంది.

ఈ ఎగుమతుల వృద్ధికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, పెట్రోలియం ఉత్పత్తులు, మందులు అనుకున్న దాని కంటే ఎక్కువగా విక్రయాలు జరిగాయి. రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 15.57 శాతం పెరిగి 2.31 బిలియన డాలర్లకి చేరుకోగా.. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 6.54 శాతం పెరిగి 4.20 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇక మందులు, ఔషధాల ఎగుమతులు 6.94 శాతం పెరిగి 2.51 బిలియన్ డాలర్లకు చేరాయి. భారత్‌లో తయారైన చౌకైన జనరిక్ ఔషధాలపై ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉండటం కూడా ఈ పెరుగుదలకు ప్రభావితం చేసింది.
అయితే.. ఈ సమయంలో అమెరికా ప్రభుత్వ విధానం కూడా ప్రభావం చూపించింది. 2025లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఫలితంగా, భారతదేశం నుండి అమెరికాకు జరిగే ఎగుమతులు గణనీయంగా తగ్గి 7.2 శాతానికి పడిపోయాయి. ఇది తొమ్మిది నెలల్లో కనిష్ట స్థాయిని స్పష్టం చేస్తుంది. అయితే ఇక్కడ ఆశాజనకమైన విషయం ఏమిటంటే... భారత ఎగుమతిదారులు ఇతర దేశాల మార్కెట్లను అన్వేషించడం ప్రారంభించారు. అమెరికా సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొంటూ, భారత్ ప్రస్తుతం కొత్త ఎగుమతి మార్కెట్లలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది.
వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్త్వాల్ ఈ మార్పును ప్రభుత్వ విధానాల ఫలితం అని అభివర్ణించారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, విధాన మార్పుల మధ్య భారత ఎగుమతిదారులు బలంగా నిలబడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థకు గట్టి మద్దతుగా నిలిచారని తెలిపారు. ఈ మొత్తం వృద్ధి దేశానికి ఆర్థిక భద్రతను మాత్రమే కాదు, అంతర్జాతీయ మార్కెట్‌లో భారత స్థానం కూడా మెరుగుపరుస్తోంది.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్‌లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications