భారతదేశం బంగారంపై చూపించే మక్కువ మరోసారి వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి దేశ ఆర్థిక బలాన్ని Gold హైలైట్ చేస్తూ వార్తల్లోకెక్కింది. ప్రముఖ మేనేజింగ్ పార్టనర్ & CIO గుర్మీత్ చదా ఇటీవల X లో పోస్టు చేసిన వివరాల ప్రకారం.. భారతదేశం దాదాపు 3.5 ట్రిలియన్ల డాలర్ల బంగారు నిల్వలను కలిగి ఉందని అంచనా వేశారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలోని లోతైన సంపద, స్థిరత్వానికి చిహ్నంగా పేర్కొనబడిందని తెలిపారు.
చదా ట్విట్ లో తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశ గృహాలు సుమారు 26 వేల టన్నుల బంగారాన్ని కలిగి ఉన్నాయి. అదనంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 900 టన్నుల Gold నిల్వలను కలిగి ఉంది. ఇక దేవాలయాలు, గురుద్వారాలు సమిష్టిగా 4 వేల టన్నుల స్వర్ణాన్ని కలిగి ఉన్నాయి. మొత్తం కలిపి 32 వేల టన్నుల బంగారం దేశంలో నిక్షిప్తమై ఉంది. అంచనా ప్రకారం 3.5 ట్రిలియన్ల డాలర్ల విలువ కలిగివుంది.

మన దగ్గర ఈ స్థాయి Gold నిల్వలు ఉన్నప్పుడు మన ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అని పిలవడం సరికాదని గుర్మీత్ చదా వ్యతిరేకించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను చనిపోయినదిగా చూపే వ్యాఖ్యలు రాజకీయ ఉద్దేశంతో చేయబడినవేనని తెలిపారు. ఈ వ్యాఖ్యలు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన విమర్శలకు ప్రత్యుత్తరంగా వచ్చినవి. ట్రంప్.. వ్యాపార సుంకాలు, రష్యాతో సన్నిహిత సంబంధాలు కారణంగా భారత్‌ను విమర్శించి మన ఆర్థిక వ్యవస్థను చనిపోయినదిగా పేర్కొన్నారు.
అయితే తాజా గణాంకాలు భారత ఆర్థిక బలాన్ని స్పష్టం చేస్తున్నాయి. Q1 FY26 (ఏప్రిల్-జూన్ 2025) GDP వృద్ధి రేటు 7.8 శాతానికి చేరింది. ఇది ఐదు త్రైమాసికాల గరిష్ట స్థాయిని సూచిస్తూ అంచనాలను అధిగమించింది. గత త్రైమాసికంలో 7.4 శాతం వృద్ధి నమోదు కాగా, గత సంవత్సరం ఇదే కాలంలో 6.7 శాతం మాత్రమే ఉంది.
భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పెరుగుతున్న ప్రధాన కారణాలను మనం పరిశీలించినట్లయితే.. దేశీయ వినియోగం గణనీయంగా పెరుగుతోంది.అలాగే సేవల రంగంలో మంచి పనితీరు కొనసాగుతోంది. ిక తయారీ రంగంలో కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులు భారతదేశ ఆర్థిక రంగాన్ని స్థిరంగా, వేగంగా అభివృద్ధి చెందుతున్నదిగా చూపిస్తున్నాయి. బంగారు నిల్వలు కూడా దేశానికి భద్రతా, ఆర్థిక స్థిరత్వానికి ప్రధాన ఆధారం అని గుర్మీత్ చదా అభిప్రాయపడ్డారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications