EV News: EV విభాగంలో భారత్ సంచలనం.. ప్రపంచంలో మొదటిసారి ఈ తరహా వెహికల్ రిలీజ్
Fast charging EV: సాంప్రదాయ ఇంధన వనరులైన పెట్రోల్, డీజిల్ నుంచి దేశం వేగంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. దీంతో ఈ వాహనాలను కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. కాగా భారత్ తాజాగా EV విభాగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది.
ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యంలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జింగ్ అయ్యే ప్యాసింజర్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ను భారత్ రిలీజ్ చేసింది. ఇందుకోసం 'ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ'తో 'ఒమేగా సీకి మొబిలిటీ' భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది కేవలం 15 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతుందని సదరు కంపెనీ చెబుతోంది.

'OSM స్ట్రీమ్ సిటీ క్విక్' EV 6 నగరాల్లో ఉన్న ఎక్స్‌పోనెంట్ వేగవంతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్‌పై 15 నిమిషాల్లో సున్నా నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 'డౌన్‌టైమ్‌ను తగ్గించడం, సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఈ వాహనంతో జరిపే ప్రతి ప్రయాణం డ్రైవర్‌లకు ఆర్థికంగా లాభం చేకూరుస్తుంది' అని ఒమేగా సీకి మొబిలిటీ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ ఉదయ్ నారంగ్ పేర్కొన్నారు.
2 లక్షల కి.మీలు లేదా ఐదేళ్ల వారంటీతో వచ్చే ఈ EV.. ఒక్కసారి ఛార్జింగ్‌పై 126 కిలోమీటర్ల సిటీ డ్రైవ్ పరిధిని కలిగి ఉంటుందని సమాచారం. దీని ధర 3.25 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా మరియు హైదరాబాద్‌లలో తన నెట్‌వర్క్‌ను విస్తరింపజేస్తుంది. ఈ ఏడాది ఢిల్లీ-NCR మరియు బెంగళూరులలో 100 ఛార్జింగ్ స్టేషన్‌లను అందుబాటులోకి తేనున్నట్లు ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ ప్రకటించింది.


Click it and Unblock the Notifications