Real Estate: రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు అలర్ట్! ఫ్యూచర్లో ఈ ఇళ్లకు డిమాండ్ ఉండదు! షాకింగ్ రిపోర్ట్!
భారతదేశంలో రియల్ ఎస్టేట్(Real Estate) మార్కెట్ గత దశాబ్దంలో రెట్టింపు కంటే ఎక్కువ వృద్ధిని సాధించింది. అయితే రాబోయే రోజుల్లో ఈ వేగం కొద్దిగా తగ్గే అవకాశం ఉందని ప్రాపర్టీ నిపుణుల అంచనా. రాయిటర్స్ (Reuters) నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. రాబోయే రెండేళ్లలో ఇళ్ల సగటు ధరలు సుమారు 6 శాతం వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే మార్కెట్ ను ప్రధానంగా నడిపిస్తున్న 'లగ్జరీ హౌసింగ్' విభాగం యొక్క ఆధిపత్యం త్వరలో తగ్గుముఖం పట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లగ్జరీ రియల్ ఎస్టేట్ జోరు తగ్గుతుందా?
ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ ను అత్యంత చురుకుగా ఉంచుతున్నది లగ్జరీ విభాగమే. అయినప్పటికీ సర్వేలో పాల్గొన్న 15 మంది విశ్లేషకుల్లో 11 మంది, ఈ లగ్జరీ విభాగం యొక్క ప్రభావం రాబోయే ఐదేళ్లలో తగ్గుతుందని విశ్వసిస్తున్నారు. కొలియర్స్ ఇంటర్నేషనల్ (Colliers International) సంస్థకు చెందిన అజయ్ శర్మ మాట్లాడుతూ.. "లగ్జరీ సెగ్మెంట్ ప్రస్తుతం అత్యున్నత స్థాయిలో ఉంది. అయితే ఇది ఖచ్చితంగా తగ్గుతుంది" అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి లగ్జరీ ఇళ్లకు మంచి డిమాండ్ ఉన్నా.. రియల్ ఎస్టేట్లో ఎక్కువ రాబడిని కోరుకునే వారు పెరుగుతున్న భూమి వ్యయం, అభివృద్ధి ఖర్చుల కారణంగా లగ్జరీ సెగ్మెంట్ కు దూరం అయ్యే అవకాశం ఉంది.
అందుబాటులో ఇళ్లు కరువు
నగరాల వారీగా అంచనాలు చూస్తే.. ఈ ఏడాది ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) 7-8 శాతం, బెంగళూరు 7 శాతం, ముంబై సుమారు 5 శాతం వరకు ధరల పెరుగుదలను నమోదు చేయవచ్చని అంచనా. ఇటీవలి నివేదికల ప్రకారం.. మొత్తం ఇళ్ల అమ్మకాలు 9 శాతం తగ్గినప్పటికీ.. డెవలపర్ల ఆదాయాలు మాత్రం 14 శాతం పెరిగాయి. దీని అర్థం మార్కెట్ ఖరీదైన గృహాల వైపు మొగ్గు చూపుతోంది. అంటే సామాన్యులకు అందుబాటులో ఉండే గృహాల సరఫరా (Affordable Housing) తగ్గిపోతోంది. కాబట్టి నిపుణుల అంచనా ప్రకారం.. ఫ్యూచర్ లో బడ్జెట్ గృహాలకే డిమాండ్ పెరగనుంది. ఇప్పటికే దాదాపు 10 మిలియన్ (కోటి) సరసమైన గృహాల కొరత ఉంది. ఇది 2030 నాటికి మూడు రెట్లు పెరగవచ్చు.
వీటికి డిమాండ్ పెరిగే అవకాశం..
లియాసెస్ ఫోరస్ (Liases Foras)కు చెందిన పంకజ్ కపూర్ మాట్లాడుతూ, "గుర్గావ్‌లో ఒక ఫ్లాట్ సగటు ధర రూ. 4 కోట్లు. అంటే దానిని కొనుగోలు చేయాలంటే ప్రజల సగటు ఆదాయం రూ. 80 లక్షలు ఉండాలి. ఎంతమంది ఆ స్థాయిలో కొనగలుగుతారు?" అని ప్రశ్నించారు. అందుకే కొత్త కొనుగోలుదారులకు వచ్చే సంవత్సరంలో బడ్జెట్ గృహాలకే ఎక్కువ మక్కు చూపే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరంగా ఉన్నప్పటికీ.. పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు లగ్జరీ విభాగం పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications