India Q2 GDP: జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ జీడీపీ వృద్ధి మరింత ఆరోగ్యకరంగా మారింది. వాస్తవానికి ఈ కాలంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలకు మించిన పనితీరును కనబరిచింది.
సెప్టెంబరుతో ముగిసిన రెండవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదైంది. అయితే ఈ కాలానికి రిజర్వు బ్యాంక్ ఇచ్చిన వృద్ధి కేవలం 6.5 శాతం కాగా అనేక మంది నిపుణులు భారత వృద్ధి అంచనాలను 6.8 నుంచి 7 శాతం మధ్య ఉంచారు. దీంతో ఇండియా ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని కొనసాగిస్తోంది. దేశంలో బలమైన తయారీ, నిర్మాణ కార్యక్రమాలు తాజా పరిణామాల వెనుక ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే క్రమంలో దేశంలోని ప్రైవేట్ రంగ మౌలిక సదుపాయాల వ్యయం మెరుగుపడుతుండగా.. ప్రభుత్వ రంగ మూలధన వ్యయం నుంచి చాలా వరకు నిర్మాణాలకు ప్రోత్సాహం లభించింది. రంగాల వారీగా పరిశీలిస్తే.. మైనింగ్, విద్యుత్, యుటిలిటీ సేవలు సెప్టెంబర్ త్రైమాసికంలో రెండంకెల విస్తరణను నమోదుచేశాయి. అలాగే రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సెక్టార్, హాస్పిటాలిటీ సేవల్లో స్వల్ప క్షీణత నమోదైంది.
రెండవ త్రైమాసికంలో దేశంలోని గ్రామీణ డిమాండ్ తగ్గుదలను నమోదు చేసింది. ఇదే క్రమంలో భారత ఫిజికల్ డెఫిసిట్ పెరిగి రూ.8.04 లక్షల కోట్లకు చేరుకుంది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవలు 6.1% నుంచి 10.1% పెరిగాయి. అలాగే నిర్మాణ రంగం గత ఏడాది 5.7%తో పోలిస్తే 13.3% వృద్ధిని నమోదు చేసింది.
ప్రస్తుత తరుణంలో భారత జీడీపీ గణాంకాలు చైనా వృద్ధి రేటును అధిగమించాయి. దీంతో విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఇండియాకు తరలించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రిజర్వు బ్యాంక్ సైతం వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఇది దోహదపడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ 4.9 శాతం రేటుతో వృద్ధి చెందుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications