నేటి సమాజంలో ఫేక్ SMS స్కామ్‌లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అందుకే ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వ అధికారులు చాలా జాగ్రత్తలు చెబుతున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు చెప్పినా హ్యకర్లు బారీన పడుతున్నారు అమాయకులు. వారు పంపే సందేశాలను అందుకుని స్కామర్ల బారిన పడుతూ భారీగా నష్టపోతున్నారు. తాజాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) భారతీయులను ఓ ప్రమాదకర నకిలీ SMS స్కామ్ నుండి అప్రమత్తం చేసింది.
ఈ స్కామ్‌లో వినియోగదారులకు మీ India Post ప్యాకేజీ గోదాములో ఉంది. మీరు మీ చిరునామా వివరాలను 48 గంటల్లోపు ఆధునీకరించకపోతే, ప్యాకేజీ తిరిగి పంపబడుతుందంటూ ఒక నకిలీ SMS పంపబడుతోంది. స్కామ్ మెసేజ్‌లో ఒక హ్యకింగ్ లింక్ కూడా ఉంది. indiapost-go-in.one/index ఈ లింక్ మీద క్లిక్ చేయమని హ్యాకర్లు సూచిస్తున్నారు.

ఈ ఫేక్ ఎసెమ్మెస్ పై అలర్ట్ గా ఉండాలని PIB హెచ్చరించింది. ఇండియా పోస్ట్ ఇలాంటివి SMSల ద్వారా చిరునామా వివరాలు అడగదు. ఇది పూర్తిగా మోసపూరితమైనది. PIB fact check బృందం, ఈ SMS స్కామ్‌ను నిర్ధారించి సోషల్ మీడియాలో హెచ్చరిక జారీ చేసిందని తెలిపింది. "మీ ప్యాకేజీ గిడ్డంగికి చేరిందని SMS వచ్చింది అంటే అప్రమత్తంగా ఉండండి! ఇది నకిలీ. ఎలాంటి లింక్‌లపై క్లిక్ చేయకండని PIB పేర్కొంది.
ఈ స్కామ్ ఎలా పనిచేస్తుంది?
48 గంటల్లో మీ వివరాలు అప్ డేట్ చేయాలని చెబుతుంది.
అధికారికంగా కనిపించే భాష ఉపయోగించి నమ్మకం కలిగించేందుకు ప్రయత్నిస్తుంది
ఫిషింగ్ లింక్‌తో వ్యక్తిగత డేటా సేకరణ లేదా మాల్‌వేర్ ఇన్‌స్టాల్ చేయడం లక్ష్యం
లింక్ క్లిక్ చేస్తే మీ స్మార్ట్‌ఫోన్ హ్యాకర్ల పరిధిలోకి వెళ్లే ప్రమాదంలో ఉంటుంది.
ఎలా సురక్షితంగా ఉండాలి?
తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన SMSలకు స్పందించకండి
అధికారిక India Post వెబ్‌సైట్ ([https://www.indiapost.gov.in](https://www.indiapost.gov.in)) లేదా హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా ధృవీకరించండి
ఎప్పుడూ అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు - అవసరమైతే URL మాన్యువల్‌గా టైప్ చేయండి
ఎలాంటి వ్యక్తిగత పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు SMS ద్వారా పంచుకోకండి
అనుమానాస్పద మెసేజ్‌లు వస్తే వెంటనే సైబర్ సెక్యూరిటీ హెల్ప్‌లైన్ ([https://cybercrime.gov.in)లో](https://cybercrime.gov.in లో) ఫిర్యాదు చేయండి
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications