దాయాది దేశంతో పాకిస్తాన్ తో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత భారత్ తన రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశ సముద్ర రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఒక కీలకమైన ముందడుగు పడింది. ఇందులో భాగంగానే మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ రూ. 5 వేల కోట్ల పెట్టుబడి ద్వారా నౌకా నిర్మాణ సామర్థ్యం పెంచుతోంది. మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) రూ.4,000 నుండి రూ.5,000 కోట్ల పెట్టుబడితో తన నౌకదళాన్ని దుర్భేధ్యమైన శత్రు వ్యవస్థగా తీర్చి దిద్దుతోంది.
ఈ మధ్య పాకిస్తాన్ తో జరిగిన ఉద్రిక్త పరిణామాల మధ్య అరేబియన్ సముద్రంలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత తీసుకున్న కీలక నిర్ణయమని చెప్పుకోవచ్చు. ఈ ఆపరేషన్‌లో భారత నౌకాదళం చూపిన తెగువకు సముద్రశక్తిని మరింతగా పెంచాలన్న దిశగా ప్రణాళికలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుత ముంబై క్యాంపస్ సమీపంలోని 10 ఎకరాల సముద్ర ప్రదేశాన్ని తిరిగి పొందిన MDL, అక్కడ రెండు కొత్త బేసిన్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా పెద్ద నౌకలు, సబ్‌మేరిన్లను ఒకేసారి నిర్మించడమే కాకుండా మరమ్మతులు కూడా చేయగల సామర్థ్యం కూడా ఏర్పడుతుంది.

ఈ తాజా విస్తరణతో MDL యొక్క డెడ్‌వెయిట్ హ్యాండ్లింగ్ సామర్థ్యం 40 వేల టన్నుల నుంచి 80 వేల టన్నులకు కానుంది. అంటే రెండింతలు పెరుగుదల కానుంది. దీంతో పాటుగా నవా శేవా పోర్ట్‌లో ఇప్పటికే 37 ఎకరాలు పొలాలను సేకరించిన MDL.. భవిష్యత్తులో 2 లక్షల డెడ్‌వెయిట్ టన్నుల సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.డెడ్‌వెయిట్ టన్నులు (DWT) అనేది ఒక ఓడ మోయగల గరిష్ట బరువును సూచిస్తుంది. ఇది ఓడలో ఉన్న కార్గో, ఇంధనం, నీరు, సిబ్బంది, సామాగ్రి మొదలైన వాటి బరువును కలిగి ఉంటుంది. దీన్ని మెట్రిక్ టన్నులలో కొలుస్తారు
ప్రస్తుతం, MDL ఒకేసారి 11 సబ్‌మేరిన్లు,10 వార్‌షిప్స్ నిర్మించగలదు. ప్రస్తుతం భారత నౌకాదళానికి ఈ సంస్థ రూ.1.06 లక్షల కోట్ల విలువైన రెండు మెజర్ సబ్‌మెరైన్ ప్రాజెక్టులపై పని చేస్తోంది. ఇవి భారత్ యొక్క అండర్‌సీ వార్‌ఫేర్ సామర్థ్యాలను కొత్త స్థాయికి తీసుకెళ్లనున్నాయి.భారత్‌లో నౌకా నిర్మాణం వేగంగా పెరుగుతున్నప్పటికీ పొరుగుదేశం చైనా కన్నా తక్కువగానే ఉంది. 370కి పైగా నౌకలతో ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళాన్నిచైనా కలిగి ఉంది. అయితే స్వదేశీ మౌలిక సదుపాయాల పెంపు ద్వారా ఈ గ్యాప్‌ను తగ్గించేందుకు భారత్ కృషి చేస్తోంది.
భారత నౌకాదళం 2047 నాటికి 100 శాతం స్వదేశీకరణతో కూడిన 175 నౌకల సామర్థ్యం ఉన్న నేవీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. MDL తాజా విస్తరణతో ఈ లక్ష్యాన్ని భారత్ త్వరలోనే సాధించనుంది. భారత ప్రభుత్వానికి చెందిన MDL ఇప్పటివరకు 800కి పైగా నౌకలు, 31 వార్‌షిప్స్, 8 సబ్‌మేరిన్లు నిర్మించింది. అంతర్జాతీయ కస్టమర్లకు 214 నౌకలను ఎగుమతి చేసింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications