Rice News: బియ్యంపై కొత్త పన్ను తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం.. పూర్తి వివరాలు..
Rice News: దేశంలో ఏర్పడిన వాతావరణ మార్పులు ఊహించని పరిణామాలకు దారితీస్తున్నాయి. ఇది కేవలం భారత్‌పై మాత్రమే కాక.. ప్రపంచ వ్యాప్తంగా అలజడికి సృష్టిస్తోంది.
రుతుపవనాల మార్పులు దేశంలో కూరగాయలు, పండ్లు, ఉల్లి, పప్పులు, బియ్యం, గోధుమల ఉత్పత్తిపై భారీగా ప్రభావాన్ని చూపింది. వీటికి తోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆ దేశాల నుంచి వచ్చే అనేక ఉత్పత్తుల ఉత్పత్తిని దెబ్బతీసింది. దీంతో వంటకు వినియోగించే సన్ ఫ్లవర్ నూనె ధరలు అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. 2022 జూన్‌లో రష్యా ప్రభుత్వం బియ్యం ఎగుమతిని నిషేధించటంతో.. ప్రపంచమే బియ్యం కోసం భారత్‌పై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి పరిస్థితుల్లో బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై గత నెలలో ఎగుమతులను నిషేధిస్తూ ఆంక్షలు తీసుకొచ్చింది. ఎగుమతులు నియంత్రించబడుతున్న వేళ స్థానిక రైతులకు కనీస మద్దతు ధర పెంపు నిర్ణయం జాక్‌పాట్ అవుతుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ప్రభుత్వం పార్బాయిల్డ్(ఉడకబెట్టిన) రకం బియ్యం ఎగుమతిపై పన్నును పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. సరఫరా ఆందోళనల కారణంగా ఈ నెలలో ఆసియా వ్యాప్తంగా బియ్యం ధరలు 2008 నాటి గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన ఆహారంగా ఉన్న బాసుమతియేతర బియ్యంపై భారత ప్రభుత్వ ఆంక్షలు ప్రపంచ జనాభాపై ఆర్థిక భారానికి కారణమైంది. దీన్ని అరికట్టేందుకు బాస్మతి బియ్యానికి కనీస ఎగుమతి ధర(ఎంఈపీ)ని నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో బాస్మతి బియ్యం కనీస ఎగుమతి ధర టన్నుకు దాదాపు 1,250 డాలర్లకు చేరుకోనుంది. పైగా దీర్ఘకాలిక నిషేధం అమెరికాలోని రైతులకు ప్రయోజనాన్ని కలిగించనుందని తెలుస్తోంది. US బియ్యం కోసం ప్రపంచ డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం 20% పన్ను విధించే ఆలోచనలో ఉంది. బాస్మతి ఎగుమతి పరిమాణం ఏప్రిల్-జూన్ కాలంలో 1.1 మిలియన్ టన్నుల నుంచి 1.2 మిలియన్ టన్నులకు పెరిగింది.


Click it and Unblock the Notifications