ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులరైన పాస్‌పోర్ట్‌ల జాబితాను హెన్లీ సంస్థ విడుదల చేసింది. ఇందులో జపాన్ మొదటి స్థానంలో నిలవగా ఆఫ్ఘనిస్థాన్ చివరి స్థానంలో ఉంది. దీని ప్రకారం చూస్తే.. మొత్తం 227లో 193 దేశాలను జపాన్ పౌరులు వీసా లేకుండా చుట్టి రావచ్చన్నమాట. లండన్‌కు చెందిన హెన్లీ అండ్ పార్టనర్స్ అనే సంస్థ ఈ నివేదికను ప్రతి 3 నెలలకు విడుదల చేస్తూ చేసింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు సంస్థ పేర్కొంది.
భారత్ విషయానికి వస్తే..
మొత్తం 109 స్థానాలతో పోలిస్తే.. 85వ మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌గా ఇండియా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 59 దేశాలకు వీసా రహిత ప్రవేశాన్ని భారత పాస్‌పోర్టు కల్పిస్తోంది. గత నాలుగేళ్లుగా 82 నుంచి 85 మధ్య భారత్ ఊగిసలాడుతోంది. గతేడాదితో పోలిస్తే 3 స్థానాలు మెరుగుపరుచుకుంది.

అమెరికా అంతంత మాత్రమే..
జపాన్ తరువాత సింగపూర్, దక్షిణ కొరియాలు రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి. జర్మనీ, స్పెయిన్ మూడవ, అగ్రరాజ్యం అమెరికా ఏడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వరుసగా ఐదోసారి జపాన్ ఈ ఘనతను సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ అట్టడుగున ఉండగా, దాయాది పాకిస్తాన్ చివరి నుంచి 4వ స్థానంలో ఉంది. కేవలం 32 దేశాలకు మాత్రమే పాకిస్తాన్ పౌరులు వీసా లేకుండా ప్రయాణించవచ్చని అర్దం.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications