Per capita income: దేశాభివృద్ధికి తలసరి ఆదాయాన్ని ఓ కొలమానంగా భావిస్తారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దేశీయ తలసరి ఆదాయం గణనీయమైన వృద్ధిని సాధించింది. అత్యంత తక్కువ ఆదాయంతో పేద దేశంగా ఉన్న భారత్ క్రమంగా పలు సంస్కరణలను ప్రవేశపెట్టింది. తద్వారా పరిస్థితులు మారుతూ వచ్చి ప్రస్తుతం అంతర్జాతీయ సమాజంలో ప్రముఖ దేశంగా ఇండియా పరిగణించబడుతోంది.
దేశవ్యాప్తంగా ఒక్కో వ్యక్తి సంపాదించే డబ్బుని తలసరి ఆదాయం సూచిస్తుంది. సాధారణంగా దేశ ఆదాయాన్ని దాని జనాభాతో భాగించడం ద్వారా ఇది లెక్కించబడుతుంది. ఈ ఆదాయంలో మగ, ఆడలతో పాటు పిల్లల సంఖ్యను కూడా తీసుకుంటారు. దేశ తలసరి ఆదాయం దాని ప్రజల జీవన ప్రమాణాలకు సూచికగా చూస్తారు.

వ్యక్తిగత ఆదాయం లెక్కలను భారతదేశంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రచురిస్తుంది. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తలసరి ఆదాయం కేవలం 249 రూపాయలు. మాక్రో ట్రెండ్స్ డేటా ప్రకారం 1960ల నాటికి అది 395కి పెరిగింది. తరువాత 20 ఏళ్లలో అంటే 1980లో 1,765 రూపాయల వరకు వృద్ధి చెందింది. 2000 ఏడాది నాటికి తలసరి ఆదాయం గణనీయంగా పెరిగి దాదాపు 20 వేలు(19 వేల 585) మార్కును టచ్ చేసింది. 2007లో తొలిసారిగా 50 వేల 454 మైలురాయిని, 2024 నాటికి ఏకంగా 2.23 లక్షల మేర అభివృద్ధి చెందింది.
స్వాతంత్ర్యం తర్వాత తలసరి ఆదాయం బాగా క్షీణించిన సంవత్సరం 1966. అప్పుడు వ్యక్తిగత ఆదాయం -24 శాతం అంటే 675. దీని తరువాత 1975, 1984, 1991, 2009 మరియు 2020లలోనూ భారీ గణనీయమైన క్షీణతను దేశం చూసింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పోల్చితే 2007లో తలసరి ఆదాయం 27.52 శాతం పెరిగింది. అంటే 249 రూపాయల నుంచి 7 దశాబ్దాలలో అనేక రెట్లు పెరిగి 2.23 లక్షలకు చేరుకుంది.
ఈ తలసరి ఆదాయాన్ని లెక్కించడం ద్వారా పలు ప్రయోజనం ఉన్నాయి. ఒక దేశంలోని ప్రజలు సంపన్నులా, వారికి అవసరమైన సేవలు అందుబాటులో ఉన్నాయా మరియు వారికి తగినంత ఆదాయం ఉందో లేదో తేలికగా తెలుసుకోవచ్చు. ఇన్వెస్టోపీడియా ప్రకారం 2022లో ప్రపంచ తలసరి ఆదాయం 17 వేల 500 డాలర్లు మరియు మొత్తం GDP 139 ట్రిలియన్ డాలర్లు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications