కాశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భరత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పోర్టల్ వెబ్‌సైట్ ఒక్కసారి క్రాష్ అయ్యింది. వరుసగా రెండు రోజుల పాటు PSX ఇండెక్స్ తీవ్ర పతనాన్ని చుసిన తర్వాత ఇవాళ వెబ్‌సైట్ క్రాష్ అయింది. నిన్న గురువారం, KSE-100 ఇండెక్స్ ట్రేడింగ్ ప్రారంభమైన మొదటి ఐదు నిమిషాల్లోనే 2.12% అంటే 2,485.85 పాయింట్లు కుప్పకూలి 114,740.29 వద్ద ముగిసింది. బుధవారం కూడా ఇదే విధమైన పతనం తర్వాత, కేవలం రెండు రోజుల్లోనే మొత్తం 2,500 పాయింట్లకు పైగా క్షీణత నమోదైంది.

PSX వెబ్‌సైట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే "WE'LL BE BACK SOON" అని ఒక మెసేజ్ చూపిస్తుంది, అలాగే నెక్స్ట్ నోటీసు వచ్చే వరకు మెయింటెనెన్స్'లో ఉందని సూచిస్తుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పాకిస్తాన్ GDP వృద్ధి అంచనాను 2.6%కి తగ్గించిన తర్వాత బుధవారం PSX నష్టాల్లో ముగిసింది, అంతేకాక ఈ పతనం గురువారం కూడా కొనసాగి తీవ్ర క్షీణత సంభవించింది. దింతో ఆర్థిక, రాజకీయ సవాళ్ల వల్ల పెట్టుబడిదారుల విశ్వాసం కూడా దెబ్బతింది.
పాకిస్తాన్ కరెన్సీ బలహీనపడటం, రాజకీయ అనిశ్చితి కొనసాగడం, పెరుగుతున్న భద్రతా ప్రమాదాలు ముఖ్యంగా కాశ్మీర్‌లో ఆర్థిక మార్కెట్లలో సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయని ఫిచ్ రేటింగ్స్ తాజాగా ఆందోళనలను వ్యక్తం చేసింది. కాశ్మీర్ ఫాల్గమ్ దాడికి బదులుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కఠినమైన చర్యలు ప్రకటించింది, వాటిలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, వాఘా-అట్టారి బార్డర్ ద్వారా వాణిజ్యాన్ని వెంటనే మూసివేయడం, సార్క్ కింద పాకిస్తానీ జాతీయులకు వీసాల రద్దు వంటివి ఉన్నాయి.
ఈ ఉద్రిక్తతల మధ్య ఇవాళ భారతదేశ దలాల్ స్ట్రీట్ కూడా దాదాపు 500 పాయింట్లు పడిపోయింది, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్‌సైట్ క్రాష్ అవటం కూడా ఈ ప్రాంతంలోని పెట్టుబడిదారుల ఆందోళనలను పెంచింది. మరోవైపు PSX వెబ్‌సైట్ అకస్మాత్తుగా క్రాష్ కావడానికి PSX ఎటువంటి అఫీషియల్ కారణాన్ని వెల్లడించలేదు.
PSX వెబ్‌సైట్ క్రాష్ తాత్కాలిక టెక్నికల్ సమస్య కావచ్చు, అయితే పాకిస్థాన్ షేర్ మార్కెట్ స్థిరత్వాన్ని తిరిగి పొందగలదా లేదా మరింతగా క్షీణత చూస్తుందా అని నిర్ణయించడంలో రాబోయే రోజులు లేదా వారాలు కీలకంగా మారాయి. మరోవైపు అనలిస్టులు స్వల్ప నుండి మధ్యస్థ కాలంలో PSX మరింతగా అస్థిరత ఉంవచ్చని అంచనా వేస్తున్నారు.
రాజకీయ ఉద్రిక్తలు, భద్రతా ప్రమాదాలు రెండు కూడా విదేశీ పెట్టుబడులను నిరోధించగలదని, ఇవి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications